Yoga Day: మానవాళికి భారత్‌ ఇచ్చిన గొప్ప వరం యోగా.. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌..

|

Jun 21, 2022 | 11:42 AM

Yoga Day: 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌..

Yoga Day: మానవాళికి భారత్‌ ఇచ్చిన గొప్ప వరం యోగా.. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌..
Follow us on

Yoga Day: 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. యోగాసనాలు వేసిన తర్వాత యోగా ప్రాముఖ్యతను వివరించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా రామ్‌ నాథ్ మాట్లాడుతూ.. ‘మన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా ఒక భాగం. మానవాళికి భారత్‌ ఇచ్చిన గొప్ప వరం యోగా. శరీరం, ఆత్మలను పరిపూర్ణం చేసే అద్భుత సాధనం యోగా’ అంటూ రాష్ట్రపతి చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా రామ్‌ నాథ్‌ పలువురితో కలిసి యోగాసనాలు వేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మైసూర్ ప్యాలస్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యోగా మనల్ని బలవంతులుగా మారుస్తుంది. యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. యోగాతో మొదలైతే ఆ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది థీమ్ ‘మానవత్వం కోసం యోగా’. యోగాతో శాంతి లభిస్తుందని మహర్షులు, ఆచార్యులు చెప్పారు. 75 చారిత్రిక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని’ ప్రధాని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..