Vadodara: గుజరాత్‌లోని వడోదర రోడ్ల వెంట పశువుల విచ్చలవిడి సంచారం ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. పశువుల దాడిలో ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. విచ్చలవిడి పశువుల భీభత్సంతో ఓ నిండు గర్భిణీ ప్రాణం పోయింది. వడోదరలో ఓ గర్భిణిని రోడ్డుపై తిరుగుతున్న ఆవు పొట్టన పెట్టుకుంది..దాంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందింది. ఆ పాప పుట్టకముందే తల్లి కడుపులోనే కన్నుమూయటంతో వారి బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం ప్రకారం…
మనీషా అనే గర్భిణిపై ఆవు దాడి చేసింది. ఆవు దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె కడుపు, శరీర బాగాలు, జననాంగాలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ, తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వైద్యులు పరీక్షించి కడుపులోనే బిడ్డ చనిపోయిందని నిర్ధారించారు. దాంతో ఆ గర్భిణి కుటుంబ సభ్యులకు షాక్ తగిలినంతపనైంది. మరోవైపు స్థానిక ప్రజల్లోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. పశువుల యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం శుభాన్‌పురా ఝాన్సీలోని రాణి సర్కిల్ సమీపంలో డ్రైవర్‌పై వీధుల్లో తిరుగుతున్న పశువులు దాడి చేయటంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై పశువులు సంచరిస్తుండడం, వీధిలైట్లు వెలగకపోవటంతో డ్రైవర్‌కు ఆవులు కనిపించలేదు. చీకట్లో డ్రైవర్‌కు ఎదురుపడ్డ ఆవులు అతన్ని తొక్కి చంపేశాయి. ఈ తరహా ఘటనతో వడోదర కార్పొరేషన్ పనితీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి