Rahul Gandhi: చైనా ఆక్రమించిన భూభాగాన్ని తెచ్చుకునేది ఎలా.. కేంద్రం కొంచెం వివరించాలని రాహుల్ ట్వీట్
Bharat Jodo Yatra: కేరళలోని తిరువనంతపురం శివారు నుంచి ఇవాళ ఉదయం యాత్ర ప్రారంభించారు. మరోవైపు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర 100 కిలోమీటర్ల మజిలీని పూర్తి చేసుకుంది. త్రివేండ్రం శివార్ల లోని కనియాపురంలో..

మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాదయాత్ర ఎనిమిదో రోజు ప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురం శివారు నుంచి ఇవాళ ఉదయం యాత్ర ప్రారంభించారు. మరోవైపు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర 100 కిలోమీటర్ల మజిలీని పూర్తి చేసుకుంది. త్రివేండ్రం శివార్ల లోని కనియాపురంలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. వందలాదిమంది కార్యకర్తలు ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, కనీసం గొడుగు లేకుండానే రాహుల్ గాంధీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో పాల్గొన్నవారి కాళ్లను బొబ్బలు వేధిస్తున్నప్పటికీ ముందుకు సాగుతున్నారు. రాహుల్ బృందానికి స్థానికుల నుంచి భారీ మద్దతు లభించింది.
వందల సంఖ్యలో స్థానికులు వచ్చి పాదయాత్రలో పాల్గొనడం కనిపించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. మరో 16 రోజులు కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 30న కర్నాటకలో ప్రవేశిస్తుంది.
China has refused to accept India’s demand of restoring status quo of April 2020.
PM has given 1000 Sq Kms of territory to China without a fight.
Can GOI explain how this territory will be retrieved?
— Rahul Gandhi (@RahulGandhi) September 14, 2022
సోమవారం నాటికి యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మంగళవారం కషక్కూట్టంలోని కనియాపురం నుంచి అట్టింగల్ వరకు కొనసాగించి విరామం తీసుకున్నారు. సాయంత్రం తిరిగి అట్టింగల్‌లో పునఃప్రారంభించి కల్లంబలం జంక్షన్ వరకు యాత్ర కొనసాగించారు. మధ్యమధ్యలో వర్షం కురుస్తున్నా గొడుగులు లేకుండానే యాత్రను కొనసాగించారు రాహుల్ గాంధీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి