
దేశంలో అక్రమంగా బంగారం రవాణా చేసే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే త్రిపురలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే అగర్తల రైల్వే స్టేషన్ నుంచి తెజాస్-రాజధాని ఎక్సప్రెస్ బయలుదేరనుంది. పక్కా సమాచారంతో పోలీసులు ఆ రైలులో తనిఖీలు చేయడం ప్రారంభించారు. చివరికి ఓ వ్యక్తి వద్ద 1.5 కేజీల బంగారం ఉండటాన్ని గుర్తించారు.వెంటనే ఆ బంగారాన్ని అతని వద్ద ఉన్న రూ.6710 నగదను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి త్రిపురాలోని సెపాహిజాలా జిల్లాకి చెందిన అబుల్ బాసర్ గా గుర్తించారు. అగర్తల రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు బయలుదేరే కొన్ని నిమిషాల ముందు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ బంగారం విలువ మార్కెట్ లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడ్ని కస్టమ్స్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..