Delhi: హస్తీనలో ఎలక్షన్ హీట్ మొదలైంది. రెండు నెలల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో మున్సిపల్ ఎలక్షన్లతో పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ, ఆప్ మధ్యలో కాంగ్రెస్ అన్నట్లు ఉంది పార్టీల పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకుని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఢిల్లీలోనూ ఉన్న మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ సబ్సిడీ పొందేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఢిల్లీలోని విద్యుత్ వినియోగదారులు ఒక్క మిస్డ్ కాల్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. అయితే అందరికీ కాకుండా కేవలం దరఖాస్తు చేసుకున్న వారికే ఈ రాయితీ అందిస్తామని తెలిపింది. మరోవైపు బీజేపీ ఆప్‌కి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఆ పార్టీని బీజేపీ ఇరుకున పెడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కేజ్రీవాల్‌పై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టింది. ఆప్ అంటే అరవింద్ అడ్వర్టైజ్ మెంట్ పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ప్రకటనల కోసం పంజాబ్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా చెల్లించలేకపోతోందని, అదే గుజరాత్‌లో యాడ్స్ కోసం గత రెండు నెలల్లో 36 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి