Viral: సర్జరీ చేస్తుండగా ఆగిపోయిన గుండె.. ఏకంగా మూడు గంటలపైనే.. కట్ చేస్తే.. ఆఖర్లో అద్భుతం!
సర్జరీ చేస్తుండగా ఓ మహిళ గుండె సుమారు 210 నిముషాలు అంటే దాదాపుగా మూడు గంటలపైనే ఆగిపోయింది. అదేంటి.?
సర్జరీ చేస్తుండగా ఓ మహిళ గుండె సుమారు 210 నిముషాలు అంటే దాదాపుగా మూడు గంటలపైనే ఆగిపోయింది. అదేంటి.? ఇదెలా సాధ్యం అవుతుంది.? గుండె 3 నిమిషాలు కొట్టుకోకపోతేనే మనిషి చనిపోతాడని అంటారా.? ఈ అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ కథేంటో మీరూ తెలుసుకోవాల్సిందే..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కంకరఖేడ్‌కు చెందిన కవిత అనే మహిళ గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. అలసట, ఛాతిలో నొప్పి వస్తోందని చికిత్స కోసం పలు ఆస్పత్రులకు తిరిగింది. అయితే ఆమెకు ఎక్కడా కూడా సరైన చికిత్స అందలేదు. ఇక చివరికి కవిత తన రోగాన్ని చూపించుకునేందుకు మేరఠ్‌లోని లాలా లజపత్‌రాయ్ మెమోరియల్వైద్య కళాశాలకు వెళ్లింది. అక్కడున్న డాక్టర్లు ఆమెకు పలు టెస్టులు నిర్వహించి.. గుండెలో వాల్వ్ ఒకటి దెబ్బతిన్నదని తేల్చారు. వెంటనే ఆపరేషన్ చేయాలని.. లేదంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు.
వైద్యులు శస్త్రచికిత్స మొదలుపెట్టారు. మెషిన్ సాయంతో మెకానికల్ హార్ట్ వాల్వ్‌ను గుండెలో అమర్చుతుండగా.. ఆమె గుండె దాదాపు 210 నిముషాలు పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. ఏం జరుగుతోందో డాక్టర్లకు అర్ధం కాలేదు. అయినా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.. చివరికి ఆమె ప్రాణాలు రక్షించారు. కాగా, ఇలాంటి ఆపరేషన్ మేరఠ్ మెడికల్ కాలేజీ చరిత్రలో మొదటిసారి జరిగిందని.. ఆమె ప్రాణాలతో బయటపడటం అందరికి సంతోషాన్ని ఇచ్చిందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఇదొక మిరాకిల్ అని వెల్లడించారు.