AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Debts: విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కమ్‌ల బకాయిలు 1.13 లక్షల కోట్లు..దీనిలో తెలుగు రాష్ట్రాల వాటా కూడా అధికమే!

డిసెంబర్‌లో విద్యుత్ ఉత్పత్తి కంపెనీల (జెన్‌కో) విద్యుత్ పంపిణీ కంపెనీలకు (డిస్కమ్‌లు) బకాయిలు 1.3 శాతం పెరిగి రూ.1,13,227 కోట్లకు చేరాయి.

Electricity Debts: విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కమ్‌ల బకాయిలు 1.13 లక్షల కోట్లు..దీనిలో తెలుగు రాష్ట్రాల వాటా కూడా అధికమే!
Electricity Discoms
KVD Varma
|

Updated on: Dec 05, 2021 | 7:50 PM

Share

Electricity Debts: డిసెంబర్‌లో విద్యుత్ ఉత్పత్తి కంపెనీల (జెన్‌కో) విద్యుత్ పంపిణీ కంపెనీలకు (డిస్కమ్‌లు) బకాయిలు 1.3 శాతం పెరిగి రూ.1,13,227 కోట్లకు చేరాయి. డిసెంబర్, 2020 నాటికి, డిస్కమ్‌లపై విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు రూ.1,11,762 కోట్లుగా ఉన్నాయి. జనరేషన్ (ప్రాప్తి) పోర్టల్ ఇన్‌వాయిసింగ్‌లో పారదర్శకతను తీసుకురావడానికి విద్యుత్ సేకరణలో చెల్లింపు ధృవీకరణ, విశ్లేషణ రిపోర్ట్ నుంచి ఈ సమాచారం తెలిసింది. డిసెంబరు, 2021లో డిస్కమ్‌లపై మొత్తం బకాయిలు కూడా మునుపటి నెలతో పోలిస్తే పెరిగాయి. నవంబర్‌లో ఇది రూ.1,13,081 కోట్లుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తిదారులు, డిస్కమ్‌ల మధ్య విద్యుత్ కొనుగోలు లావాదేవీలలో పారదర్శకతను తీసుకురావడానికి మే, 2018లో ఈ ప్రాప్తి పోర్టల్ ప్రారంభించారు.

డిస్కమ్‌లు చెల్లించడానికి 45 రోజుల సమయం..

డిసెంబర్ 2021 వరకు 45 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా డిస్కమ్‌లపై మొత్తం బకాయిలు రూ.1,01,436 కోట్లు. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది రూ.98,334 కోట్లు. పోర్టల్ నుంచి వచ్చిన తాజా డేటా ప్రకారం, నవంబర్‌లో డిస్కమ్‌లపై మొత్తం బకాయిలు రూ.1,00,417 కోట్లుగా ఉన్నాయి.

విద్యుత్ ఉత్పత్తి సంస్థలు విక్రయించిన విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు డిస్కమ్‌లకు 45 రోజుల గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఈ మొత్తం పాత బకాయిల్లోనే వస్తుంది. చాలా సందర్భాలలో, విద్యుత్ ఉత్పత్తిదారులు జరిమానా వడ్డీని వసూలు చేస్తారు. విద్యుత్ ఉత్పాదక సంస్థలకు ఉపశమనం కోసం, కేంద్రం ఆగస్టు 1, 2019 నుండి చెల్లింపు భద్రతా విధానాన్ని అమలు చేసింది. ఈ ఏర్పాటు ప్రకారం విద్యుత్ సరఫరా పొందడానికి డిస్కమ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలి.

అత్యధిక బకాయిలు ఉన్న రాష్ట్రాలివే..

కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించింది. చెల్లింపులో జాప్యం కోసం డిస్కమ్‌లపై జరిమానా ఛార్జీలు మినహాయించారు. మే, 2020లో, డిస్కమ్‌ల కోసం ప్రభుత్వం రూ. 90,000 కోట్ల నగదు ఇన్ఫ్యూషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) మరియు REC లిమిటెడ్ నుండి చౌకగా రుణాలు తీసుకోవచ్చు. తర్వాత ప్రభుత్వం ఈ ప్యాకేజీని రూ.1.2 లక్షల కోట్లకు, ఆ తర్వాత రూ.1.35 లక్షల కోట్లకు పెంచింది.

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ మరియు తమిళనాడు రాష్ట్రాల పంపిణీ కంపెనీలు ఉత్పత్తి చేసే కంపెనీల బకాయిల్లో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయని డేటా చెబుతోంది.

డిస్కమ్‌లో మొత్తం రూ.1,01,436 కోట్లు బకాయిలు ఉన్నాయి

చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత డిసెంబర్ 2021 నాటికి డిస్కమ్‌లపై మొత్తం బకాయిలు రూ.1,01,436 కోట్లుగా ఉన్నాయి. ఇందులో స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల వాటా 51.18 శాతం. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన జెన్కో(GENCO) బకాయిలు 23.95 శాతం.

ప్రభుత్వ రంగ సంస్థల్లో డిస్కమ్‌ల నుంచి ఎన్‌టీపీసీ ఒక్కటే రూ.4,344.75 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. ఎన్ఎల్సీ(NLC) ఇండియా బకాయిలు రూ. 2,772.47 కోట్లు.

ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలలో అదానీ పవర్ రూ.25,141.73 కోట్లు, బజాజ్ గ్రూప్‌నకు చెందిన లలిత్‌పూర్ పవర్ జనరేషన్ కంపెనీ రూ.4,503.45 కోట్ల బకాయిలు ఉన్నాయి. అదే సమయంలో సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన ఇంధన సంస్థల బకాయిలు రూ.20,318.79 కోట్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి: EPF and LIC: మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది తెలుసా? ఇదెలా సాధ్యమంటే..

Omicron: వామ్మో ఒమిక్రాన్.. ఇది ఎందుకు వేగంగా విస్తరిస్తుందో తెలిసింది..ఇది సాధారణ వేరియంట్ కాదు.. అంతకుమించి!

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!