ముంబైలో కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మహిళలకు గాయాలు..
ఓ వైపు కరోనాతో అల్లాడుతున్న ముంబైలో.. మరో ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఈస్ట్ జోగేశ్వరీ ప్రాంతంలోని మేగ్వాడిలో ఓ బిల్డింగ్ కుప్పకూలింది.
ఓ వైపు కరోనాతో అల్లాడుతున్న ముంబైలో.. మరో ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఈస్ట్ జోగేశ్వరీ ప్రాంతంలోని మేగ్వాడిలో ఓ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక కూపర్ ఆస్పత్రికి తరలించారు.
బీఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.30 సమయంలో.. మూడంతస్థుల బిల్డింగ్ మేగ్వాడి ప్రాంతంలో కూలిందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బిల్డింగ్‌లో ఎవరూ లేరని.. ఆ బిల్డింగ్ సమీపంలో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయని తెలిపారు.
Mumbai: Portion of a building collapsed in Kurla area today, no casualties reported. #Maharashtra pic.twitter.com/jOckt81n45
— ANI (@ANI) June 18, 2020