Maharashtra: డబ్బు కోసం ఇంతకు దిగజారుతారా.. ఐదుగురు పిల్లల్ని కని.. వారందరినీ అమ్మేశారు..
పిల్లల్ని కనడమే వారి పని.. ఆగండాగండి.. అసలు స్టోరీ తెలిస్తే మీరు ఇంతకంటే ఎక్కువే ఉంటారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఎవరూ చేయని పనికి సిద్ధమయ్యారు ఆ పేరెంట్స్. తొలి కాన్పులో...
పిల్లల్ని కనడమే వారి పని.. ఆగండాగండి.. అసలు స్టోరీ తెలిస్తే మీరు ఇంతకంటే ఎక్కువే ఉంటారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఎవరూ చేయని పనికి సిద్ధమయ్యారు ఆ పేరెంట్స్. తొలి కాన్పులో ఆడపిల్ల పుడితే సాకలేమంటూ అమ్మేశారు. ఈ ఐడియా ఏదో బాగుందనుకున్న ఆ ప్రబుద్ధులు దీన్నే డబ్బులు సంపాదించుకునేందుకు సరైన మార్గంగా మలుచుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. ఏకంగా ఐదుగురు పిల్లల్ని కని.. వారందరినీ అమ్మేశారు. అంతటితో వారి ధనదాహం తీరలేదు. పక్క వాళ్ల పిల్లలనూ కిడ్నాప్ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా ఒకరిని అపహరించి అమ్మేశారు కూడా. మరో శిశువును కిడ్నాప్ చేసి అమ్మేందుకు ట్రై చేస్తుండగా వారి స్టోరీ బట్టబయలైంది. తమ చిన్నారి కనిపించడం లేదంటూ ఆ తల్లిదండ్రులు స్టేషన్ మెట్లెక్కడంతో అసలు సీన్ తెలిసింది. పిల్లల్ని కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యోగేంద్ర ప్రజాపతికి రీటా అనే మహిళతో వివాహమైంది. 2017లో పెళ్లి కాగా.. 2018 లో వారికి ఓ పాప జన్మించింది. అయితే పాపను పోషించడం కష్టంగా భావించిన ఆ పేరెంట్స్ గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని రూ.25 వేలకు అమ్మేశారు. ఆ తరువాత మరో నలుగురు పిల్లల్ని కన్నారు. వారిని కూడా అలాగే విక్రయించేశారు. అంతటితో ఆగకుండా ఇతరుల పిల్లల్ని ఎత్తుకెళ్లడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ నెల 10న నాగ్‌పుర్‌లోని బాలాఘాట్‌లో 8 నెలల శిశువును అపహరించారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఆచూకీ కోసం ఆరా తీసినా లాభం లేకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.
వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విషయాలకు ఈ సంచలన విషయాలు తెలిశాయి. యోగేంద్ర దంపతుల ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు తెలిశాయి. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయిదుగురు పిల్లలను కని అమ్మేసినట్లు తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..