Watch: న్యాయం చేయాలని మంత్రాలయలోకి దూసుకెళ్లిన రైతులు.. పోలీసులు ఏం చేశారంటే..? వీడియో..

Maharashtra farmers protest: మహారాష్ట్ర రైతులు కదం తొక్కారు. ముంబైలోని సెక్రటేరియట్‌ మంత్రాలయను దిగ్భంధించారు అన్నదాతలు. భూసేకరణ పేరుతో తమకు అన్యాయం చేశారని.. సరైన పరిహారం ఇవ్వలేదని సెక్రటేరియట్‌ లోకి దూసుకెళ్లారు. దీంతో 15 రోజుల్లో రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం షిండే.

Watch: న్యాయం చేయాలని మంత్రాలయలోకి దూసుకెళ్లిన రైతులు.. పోలీసులు ఏం చేశారంటే..? వీడియో..
Maharashtra Farmers Protest

Updated on: Aug 29, 2023 | 9:53 PM

Mumbai Farmers Protest: మహారాష్ట్ర రైతులు కదం తొక్కారు. ముంబైలో సెక్రటేరియట్‌ మంత్రాలయను ముట్టడించారు. మంత్రాలయలోకి దూసుకెళ్లారు రైతులు.. భూసేకరణ పేరుతో తమ భూములను ప్రభుత్వం లాక్కుందని, సరైన పరిహారం ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. మంత్రుల కార్యాలయాలను ముట్డడించారు. వందలాదిమంది రైతులు మంత్రాలయ లోకి దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులను అడ్డుకోవడానికి పోలీసులు , సెక్యూరిటీ సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. కొందరు రైతులు సెక్రటేరియట్‌ లోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. అక్కడ సేఫ్టీ వలలు ఉండడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు చాలా మంది రైతులను అరెస్ట్‌ చేసి మెరైన్‌ డ్రైవ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సేఫ్టీ వలలో పడ్డ రైతులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కూడా కిందకు దూకారు.

భూములకు సరైన పరిహారం ఇవ్వాలని ..

తమ భూములకు సరైన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతులకు నచ్చచెప్పడానికి మంత్రి దాదాజీ బూసే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రైతులు ఆయన్ను చుట్టుముట్టడంతో తోపులాట జరిగింది. రైతుల సమస్యలను పరిష్కరించడానికే తాము చర్చలకు ఆహ్వానించామని తెలిపారు సీఎం ఏక్‌నాథ్‌షిండే.. 15 రోజుల్లో అన్నదాతల సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

రైతుల సమస్యలను పరిష్కరించడంలో షిండే-ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కాంగ్రెస్‌, శివసేన ఉద్దవ్‌ వర్గం నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రైతులు మంత్రాలయను ముట్టడించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల ఆందోళనకు తమ సంపూర్ఱ మద్దతు ఉంటుందన్నారు.

సీఎం షిండే ఏం మాట్లాడారంటే..?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..