స్కూల్‌లో దించుతానని కారు ఎక్కించుకున్నాడు.. కట్‌చేస్తే.. రూమ్‌కు తీసుకెళ్లి..
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్కూల్‌కు వెళ్తున్న 14 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన కొందరు దుండగులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..15 ఏళ్ల మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని రిమాండ్‌కు తరలించారు.

స్కూల్‌కు వెళ్తున్న 14 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌పూర్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న స్కూల్‌లో పదో తరగతి చదువుతుంది. ఇక రోజులాగే శుక్రవారం( మే 16వ తేదీన) ఆ బాలిక నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తోంది. అయితే అదే స్కూల్‌లో చదువుతున్న 15 ఏళ్ల బాలుడు ప్రతికల్ ఇదే మార్గంలో కార్లో బాలిక కోసం ఎదురుచూస్తు ఉన్నాడు. బాలిక అక్కడికి రాగనే.. ఆమెను పలిచి స్కూల్‌లో వదిలేస్తానని చెప్పి కార్లో ఎంక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లాడు.
ఇక స్కూల్‌కు వెళుతున్న తరుణంలో మార్గమధ్యలో మరో ఇద్ధరు యువకులు ప్రదీప్ (18), సౌరభ్ (18) ఎక్కించుకున్నాడు. అయితే వీళ్లు ఎవరని బాలిక ప్రశ్నించగా వాళ్లు కూడా స్కూల్‌కే వస్తున్నారని తెలిపాడు. ఇక ముగ్గురు కలిసి బాలికను బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్లారు. బాలికను బంధించి మైనర్ సహా ఇద్దరు యువలకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలక అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
కాసేపటి తర్వాత బాలికకు మెలకువ రావడంతో లేచి అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది. ఈ విషయాన్ని తన బంధువైన ఓ మహిళతో చెప్పింది. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని బాలిక తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలి తల్లి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 ఏళ్ల మైనర్ బాలుడు ప్రతికల్‌తో పాటు ప్రదీప్ (18), సౌరభ్ (18)ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక దళితురాలు రావడంతో పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ ,పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుప్చారు. దీంతో ముగ్గురికి కోర్టు 14 రోజులు జూడియల్‌కస్టడీ విధించినట్టుఅడిషనల్ పోలీస్ సూప్రంద్ అఖండ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు ముందు రోజు ప్రతికల్ బాలికకు ఇన్‌స్టాలో మెసెజ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ చాట్‌లో ప్రతికల్ బాలికను కలవాలని అడగగా.. బాలిక అందుకు నిరాకరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
