PM Rojgar Mela 2022: సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ‘రోజ్‌గార్ యోజన’.. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
జాబ్ మేళా కింద దేశవ్యాప్తంగా 75 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు ప్రధాని మోదీ. వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు

జాబ్ మేళా కింద దేశవ్యాప్తంగా 75 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు ప్రధాని మోదీ. వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు మరో 25 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. భారత 75వ స్వాతంత్రదినోత్సవ వేడుకల వేళ 75 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు మోదీ. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఈ నియామకాలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర సాంస్కృతి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్‌లోని బోయిగూడ రైల్ కళారంగ్‌లో రోజ్‌గార్ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర మంత్రి.. అభివృద్ధి, స్వావలంబన భారత్ కోసం ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని అన్నారు. కొత్తగా నియమితులైన వారు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ముద్ర, స్టార్ట్‌అప్ ఇండియా, అటల్ ల్యాబ్స్, కౌశల్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా యువత, మహిళలకు సాధికారత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీలు కే లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




In my address spoke on various initiatives of @NarendraModi Govt in empowering youth &women through initiatives like Mudra, Sart-up India, ATAL labs, KaushalYojana among others
Hon MPs Sh @drlaxmanbjp, Sh @bandisanjay_bjp, HoDs of various central govt. undertakings also attended pic.twitter.com/2UlbgDNQZd
— G Kishan Reddy (@kishanreddybjp) October 22, 2022
ఒడిశాలో ధర్మేంద్ర ప్రదాన్..
ఇక ఒడిశాలోని భువనేశ్వర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వందలాది మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 239 మంది యువకులకు నియామక పత్రాలు అందజేసినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. దేశంలో యువతకు ఉపాధి కల్పించి, దేశ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలనే సంకల్పంతోనే ప్రధాని నరేంద్ర మోదీ 10 లక్షల ఉద్యోగ నియామకాలను లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు మంత్రి. క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు అన్ని డిపార్ట్‌మెంట్లలో నియామకాలు చేపట్టాలని, దేశ వ్యాప్తంగా 75 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ @narendramodi ଜୀ ଆଜି ଭଳି ପବିତ୍ର ଦିନରେ ଭିସି ଜରିଆରେ ଦେଶର 10 ଲକ୍ଷ ଯୁବବର୍ଗଙ୍କୁ ନିଯୁକ୍ତି ଯୋଗାଇ ଦେବା ଲକ୍ଷ୍ୟରେ #RozgarMela ର ଶୁଭାରମ୍ଭ କରିଛନ୍ତି । ପ୍ରଥମ ପର୍ଯ୍ୟାୟରେ ସମଗ୍ର ଦେଶର 75,000 ନୂତନ ନିଯୁକ୍ତିଧାରୀଙ୍କୁ ନିଯୁକ୍ତିପତ୍ର ପ୍ରଦାନ କରାଯାଇଛି । pic.twitter.com/2vQ9H8w1zE
— Dharmendra Pradhan (@dpradhanbjp) October 22, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..