Lucky Bisht: మోదీ మాజీ సెక్యూరిటీ గార్డుకి ‘బిగ్‌’ ఆఫర్.. లక్షలు సంపాదించుకునే అవకాశం.. అయినా కానీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్‌కు బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే ఈ ఆఫర్‌ను అతను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు కూడా లక్కీ వివరించాడు.

Lucky Bisht: మోదీ మాజీ సెక్యూరిటీ గార్డుకి 'బిగ్‌' ఆఫర్..  లక్షలు సంపాదించుకునే అవకాశం.. అయినా కానీ..
Pm Narendra Modi's Former Security Personnel Lucky Bisht Rejects The Biggboss Offer
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 18, 2024 | 1:11 PM

సల్మాన్ ఖాన్ రియాల్టీ షో బిగ్ బాస్ 18 బుల్లితెరపై హల్ చల్ చేస్తోంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్‌కు బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే ఈ ఆఫర్‌ను అతను తిరస్కరించినట్లు తెలిసింది. మాజీ స్నిపర్‌గా,  RAW ఏజెంట్ పనిచేసిన లక్కీ బిష్త్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ 18 మేకర్స్ అతనిని సంప్రదించినట్లు సమాచారం. అయితే, అతను షోలో పాల్గొనడానికి తిరస్కరించాడు. లక్కీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నాడు.. “ఒక RAW ఏజెంట్‌గా, మా జీవితాలు తరచుగా గోప్యత మరియు రహస్యంతో కప్పబడి ఉంటాయి. మేము ఎవరనే వివరాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మా గుర్తింపు లేదా వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ బహిర్గతం చేయకుండా మేము శిక్షణ పొందాము, నేను దానికి కట్టుబడి ఉన్నాను. ప్రజలు దీనిని అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన లక్కీ తన టీమ్‌తో సంప్రదించి, బిగ్ బాస్ మేకర్స్‌తో పలు సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పారు. గత సంవత్సరం, ప్రఖ్యాత క్రైమ్ రైటర్ మరియు మాజీ జర్నలిస్ట్ ఎస్ హుస్సేన్ జైదీ లక్కీపై జీవిత చరిత్రను రా హిట్‌మ్యాన్: ది రియల్ స్టోరీ ఆఫ్ ఏజెంట్ లిమా అనే పేరుతో రాశారు. దీనిని సైమన్ & షుస్టర్ ప్రచురించారు. ఆయనపై బయోపిక్ సినిమా కూడా రూపొందుతోంది.

Pushpa 2: పుష్ప 2 ట్రైలర్‌పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా..

ఉత్తరాఖండ్ మాజీ NSG కమాండో, RAW గూఢచారి లాల్ లక్ష్మణ్ లక్కీ బిష్త్ చేసిన అనేక పాడ్‌కాస్ట్‌లు ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. లక్కీ బిష్త్ నరేంద్ర మోడీ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డ్‌గా ఉండటంతో పాటు గూఢచారిగా కూడా పనిచేశాడు. భారతదేశంలోని అనేక ఏజెన్సీలలో పనిచేసిన లక్కీ బిష్త్ అనేక సైనిక కార్యకలాపాలను పూర్తి చేశాడు. 36 ఏళ్ల లక్కీ బిష్త్ తన జీవితకాలంలో 4 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. లక్కీ బిష్త్ తన జీవితం గురించి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత అవినీతికరమైన ప్రదేశం జైలు అని అతను తరచుగా పాడ్‌కాస్ట్‌లలో పేర్కొన్నాడు. అతని తాత మరియు తండ్రి కూడా ఆర్మీలో పనిచేశారు. లక్కీ 16 ఏళ్ల వయసులో సైన్యంలో చేరాడు. ఒకప్పుడు ఉత్తరాఖండ్ గ్యాంగ్‌స్టర్ల హత్యలో అతని పేరు వచ్చింది. 2011లో జైలుకెళ్లి, ఆ తర్వాత క్లీన్‌చిట్‌ పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి