Ayodhya Ram Mandir: అయోధ్యానగరిలో కొలువుదీరిన శ్రీరాముడు.. ఆనందంతో పరవశించిన కోట్లాది హృదయాలు..
అదిగో అయోధ్య రాముని తొలి దర్శనం..! నిజంగా అద్భుతం..బాలరాముని ముగ్ధమనోహర రూపం..! నిజంగా..ఎంత అందగాడు మన రాముడు! అదిగో చూడండి.. పద్మాలవంటి కన్నులు గలవాడు. రూపెత్తిన ఆ సౌందర్యం శ్రీరాముడు! స్వచ్ఛమైన ఆ అందం మనకు శాంతిని, సంతోషాన్ని కల్గిస్తుంది. దివ్య సౌందర్యంతో విరాజిల్లుతున్నాడు అయోధ్య రాముడు! అసలు రామా అని పలికితే చాలు..జన్మధన్యమవుతుంది.
అదిగో అయోధ్య రాముని తొలి దర్శనం..! నిజంగా అద్భుతం..బాలరాముని ముగ్ధమనోహర రూపం..! నిజంగా..ఎంత అందగాడు మన రాముడు! అదిగో చూడండి.. పద్మాలవంటి కన్నులు గలవాడు. రూపెత్తిన ఆ సౌందర్యం శ్రీరాముడు! స్వచ్ఛమైన ఆ అందం మనకు శాంతిని, సంతోషాన్ని కల్గిస్తుంది. దివ్య సౌందర్యంతో విరాజిల్లుతున్నాడు అయోధ్య రాముడు! అసలు రామా అని పలికితే చాలు..జన్మధన్యమవుతుంది. ‘రా’ అన్న అక్షరం పాపాలను బయటకు తరుముతుంది. ‘మ’ అనే అక్షరం వాకిలి తలుపు దగ్గరే పాపాలను అడ్డుకుని..మళ్లీ లోపలకు రాకుండా చేస్తుంది. ఆశ్రితులను కాపాడుతుంది. ఇది ఎన్ని శతాబ్దాల ఎదురుచూపో! బాల రాముని రాకకోసం అయోధ్యాపురి ఎంత తపించిందో!! అదిగో మన అయోధ్య బాలరాముడు! ఆప్తజన బాంధవుడు. త్యాగానికి, సేవకు మారుపేరు! బాల రాముని విగ్రహాన్ని చూడటంతో..మనసు పులకిస్తోంది. ఆ పురుషోత్తముని తొలి దర్శనంతో.. హృదయం ఆనందంతో పరవశిస్తోంది.
అయోధ్యలోని దివ్యమందిరంలో మర్యాద పురుషోత్తముడు రాముడు కోలువుదీరాడు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా ముగిసింది. ప్రధాని మోదీ సహా అనేక మంది ప్రముఖులు.. ఈ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరయ్యారు. సరిగ్గా 12:29:08 నుంచి 12:30:32 సెకన్ల వరకూ నిర్ణయించిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో క్రతువును పూర్తిచేశారు. అభిజిత్ లగ్నంలో 84 సెకన్ల దివ్యముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రామ్‌లలా విగ్రహం కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగించాక.. బంగారంతో చేసిన కడ్డీతో శ్రీరాముడికి కాటుకను దిద్దారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 108 దీపాలతో బాలరాముడికి హారతినిచ్చారు. రామయ్య ప్రాణప్రతిష్ఠకు తరలివచ్చిన 7 వేల మంది అతిథులు.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అయోధ్యానగరి భక్తజనంతో కిక్కిరిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..