PM Modi Letter: పాక్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు ప్రధాని మోదీ లేఖ.. ముందు ఆ రెండింటిపై దృష్టి పెట్టాలని హితవు

పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాస్తూ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi Letter: పాక్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు ప్రధాని మోదీ లేఖ.. ముందు ఆ రెండింటిపై దృష్టి పెట్టాలని హితవు
Pm Modi Shabaz
Follow us

|

Updated on: Apr 14, 2022 | 3:34 PM

PM Modi Letter to Pak PM: పాకిస్తాన్(Pakistan) కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌(Shahbaz Sharif)కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) లేఖ రాస్తూ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. షాబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఈ లేఖను పంపారు. షాబాజ్ షరీఫ్‌కు పంపిన లేఖలో, ప్రధాని మోదీ అతనికి అభినందనలు తెలుపుతూ.. ఉగ్రవాదంపై చర్య తీసుకునేలా ప్రేరేపించారని ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి. ట్విట్ తరహాలో శుభాకాంక్షలతో పాటు, రెండు దేశాల మధ్య సత్ససంబంధాలు మెరుగుపడాలని ప్రధాని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య చర్చల కోసం తీవ్రవాద రహిత వాతావరణం రూపొందించుకోవాలన్నారు. భారతదేశం కూడా పేదరికంతో సహా ఇతర సమస్యలపై మాట్లాడాలని, కలిసి వ్యవహరించాలని కోరుకుంటోందని ప్రధాని లేఖ రాశారు.

ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి స్వయంగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా ఆహ్వానించడంతోపాటు ఆయనను స్వయంగా కలిసేందుకు లాహోర్ కూడా వెళ్లడం గమనార్హం. అయితే, ఆ తర్వాత జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షాబాజ్ షరీఫ్.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు కావడం విశేషం. నిజానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నాయకుడు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ప్రతిపక్షం నుంచి షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దేశ నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో సెనేట్ ఛైర్మన్ సాదిక్ సంజరానీ ప్రమాణం చేయించారు.

ఇదిలావుంటే, షాబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్ పార్లమెంట్ షహబాజ్ షరీఫ్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయనకు అనుకూలంగా 174 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పీటీఐ ఎంపీలు హాజరు కాలేదు. PTI మొత్తం ప్రక్రియను బహిష్కరించింది. పాకిస్తాన్ దేశ 22వ ప్రధానమంత్రిని అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించి, అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తొలి ప్రధానిగా పాకిస్తాన్ చరిత్రలో నిలిచారు. ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టు 18న పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను 10 ఏప్రిల్ 2022 వరకు 1,332 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మూడు సంవత్సరాల ఏడు నెలల 23 రోజుల పాటు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగారు.

Read Also….  TELANGANA POLITICS: తెలంగాణాలో రాజకీయ కలకలం.. యాత్రల జోరు.. అధికార పార్టీ ఎదురు దాడి.. నిండువేసవిలో రాజకీయ పండగ

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..