Rajasthan: రాజస్థాన్‌పై ఫోకస్ పెంచిన ప్రధాని మోదీ.. దేవనారాయణ్ అవరణ్ వేడుకలకు హాజరు..

రాజస్థాన్‌లో ఎన్నికల నగారా మోగించారు ప్రధాని మోదీ. బిల్వారాలో భగవాన్‌ శ్రీ దేవనారాయణ్‌ 1111 అవతరణ్ వేడుకలకు హాజయ్యారు ప్రధాని.

Rajasthan: రాజస్థాన్‌పై ఫోకస్ పెంచిన ప్రధాని మోదీ.. దేవనారాయణ్ అవరణ్ వేడుకలకు హాజరు..
Pm Narendra Modi

Updated on: Jan 28, 2023 | 5:23 PM

రాజస్థాన్‌లో ఎన్నికల నగారా మోగించారు ప్రధాని మోదీ. బిల్వారాలో భగవాన్‌ శ్రీ దేవనారాయణ్‌ 1111 అవతరణ్ వేడుకలకు హాజయ్యారు ప్రధాని. మరో 10 నెలల్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో గుజ్జర్‌ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే బిల్వారాలో మోదీ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భగవాన్‌ శ్రీ దేవనారాయణ్‌ 1111 అవతరణ్ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. హారతి ఇచ్చారు. తాను ప్రధానిగా ఇక్కడికి రాలేదని, కేవలం భక్తుడిగా మాత్రమే దేవనారాయణుడిని దర్శించుకున్నట్టు తెలిపారు మోదీ. ఆలయంలో యాగశాలను కూడా సందర్శించారు మోదీ.

ఎన్నో దాడులు జరిగినప్పటికి భారతీయ సంస్కృతి, ఆచారాలు ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఉండాయన్నారు మోదీ. బానిసత్వ మనస్తత్వాన్ని వీడి ప్రజలు దేశం కోసం మంచి ఆలోచనలు చేయాలన్నారు. రాజస్థాన్‌ వీరులకు జన్మనిచ్చిన గొప్ప పవిత్ర భూమి అన్నారు మోదీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..