AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ఈ అమ్మ గాత్రం అద్భుతాన్ని చేసింది.. ఫ్రొఫెషనల్స్ కు ఏ మాత్రం తగ్గకుండా.. క్యూట్ వీడియో..

మ్యూజిక్, పాటలు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ సంగీతాన్ని ఇష్టపడుతుంటారు. చాలా మంది తాము పని చేసే సమయంలో మనసుకు నచ్చిన పాటను హమ్...

Trending Video: ఈ అమ్మ గాత్రం అద్భుతాన్ని చేసింది.. ఫ్రొఫెషనల్స్ కు ఏ మాత్రం తగ్గకుండా.. క్యూట్ వీడియో..
Woman Singing Video
Ganesh Mudavath
|

Updated on: Jan 28, 2023 | 5:03 PM

Share

మ్యూజిక్, పాటలు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ సంగీతాన్ని ఇష్టపడుతుంటారు. చాలా మంది తాము పని చేసే సమయంలో మనసుకు నచ్చిన పాటను హమ్ చేస్తుంటారు. అయితే.. చాలా మందికి మంచి గాత్రం ఉంటుంది. అలాంటి వారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. వారు ప్రొఫెషనల్ సింగర్స్ కానప్పటికీ.. అచ్చం అలాంటి వాయిస్ ను కలిగి ఉంటారు. మరోవైపు.. సోషల్ మీడియా వినియోగం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. రీల్స్, షార్ట్స్, స్టోరీస్ ను ఎక్కువగా చూస్తున్నారు. అంతే కాకుండా వాటిని చేసేందుకూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమలో దాగి ఉన్న ట్యాలెంట్ ను బయటకు తీసేందుకు సోషల్ మీడియాను చక్కని సాధనంగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. రోటీలు చేయడాన్ని చూడవచ్చు. అదే సమయంలో ఆమె ఓ పాటను హమ్ చేస్తోంది. కొంత సమయం తర్వాత సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఆమె దగ్గరే ఉన్న కూతరు..‘మమ్మీ.. నాకోసం పాట పాడు..’ అని కోరడం చూడవచ్చు. నీ వాయిస్ నాకు చాలా బాగుంటుంది.. నువ్వు పాట పాడి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు పాడాల్సిందే అని పట్టుబట్టడంతో ఆమె కాదనలేకపోయింది. ‘మేరే నైనా సావన్ భాదో’ అని హమ్ చేయడం స్టార్ట్ చేసి, అద్భుతంగా పాడుతుంది. ఆమె గాత్రం చాలా అందంగా ఉంది. ఆ వాయిస్ విన్న వాళ్లు ఎవరైనా సరే.. ఆమె నోట నుంచి వచ్చే పాటను మళ్లీ మళ్లీ వినడానికి ఇష్టపడతారనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన గానం వీడియోను ఐఏఎస్ అధికారి.. అవ్నీష్ శరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీనికి ‘అద్భుతం’ అనే క్యాప్షన్‌లో రాశారు. రెండు నిమిషాల 17 సెకన్ల ఈ వీడియోను 7 లక్షల 59 వేలకు పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ఫన్నీగా రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.