Terrorism Funding: ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తున్న పోరాటంలో భాగంగా మరో అడుగు.. అంతా మన దేశంలోనే..

|

Nov 16, 2022 | 11:37 AM

ప్రపంచంలోని కొన్ని దేశాలలు ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తుంటే మరికొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానిని పెట్టి పోషిస్తున్నాయి. ఉగ్రవాదం కోసం నిధుల సమకూర్చకూడదనే..

Terrorism Funding: ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తున్న పోరాటంలో భాగంగా మరో అడుగు.. అంతా మన దేశంలోనే..
Pm Modi And Home Minister
Follow us on

ఎన్నో సంవత్సారల నుంచి ప్రపంచానికి తీరని సమస్యగా ఉగ్రవాదం ఉంది. ప్రపంచంలోని కొన్ని దేశాలలు ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తుంటే మరికొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానిని పెట్టి పోషిస్తున్నాయి. ఉగ్రవాదం కోసం నిధుల సమకూర్చకూడదనే ప్రధాన ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే.. నవంబర్ 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ అనే అంశంపై జరిగే మూడో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రభుత్వం తన అధికారిక ప్రకటన తెలియపరిచింది. దీనిని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన కేంద్ర హోం శాఖ ఘనంగా నిర్వహించబోతోంది. ‘‘ప్రధాని మోదీ ఈ మూడో మంత్రివర్గ సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగబోతోంద’’ని హోంశాఖ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తోందని, ఉగ్రవాదానికి నిధులు సమకూరకుండా చూడడమనేది ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తుందిని భారత్ తెలుసుకుందని ఆ ప్రకటనలో తెలిపింది.

గత కాలంలో పారిస్ అండ్ మెల్‌బోర్న్‌లలో నిర్వహించిన రెండు సమావేశాలలోనూ.. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందకుండా చూడడంపై చర్చలతో ముందుకు వెళ్లాం. వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లడమే ఈ నెలలో జరగబోయే సమావేశం ప్రధానోద్దేశ్యమ’’ని హోం శాఖ పేర్కొంది. భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై తన ‘‘జీరో-టోలరెన్స్ పాలసీ’’ని అమలు చేయడంలో నిమగ్నమయిందని కూడా ఈ ప్రకటనలో హోంశాఖ చెప్పింది.

ప్రధానాంశాలు:-

• ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు నిర్వహించడానికి వాటి పరిధిలోని సంస్థలకు తరచుగా నిధులు సమకూర్చడమనేది చాలా అవసరం. ఈ లావాదేవీలన్ని అధికారిక మార్గాల ద్వారా, క్రమబద్ధీకరించబడని ఛానెల్‌ల ద్వారానే జరుగుతుండవచ్చు.

ఇవి కూడా చదవండి

• టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ మధ్య స్పష్టమైన సారూప్యతను గుర్తించవచ్చు, ఎందుకంటే రెండు విధానాలలోనూ రాష్ట్ర అధికారుల నుంచి నిధులను దాచడానికే ప్రయత్నాలు చేస్తారు.

• వ్యవస్థీకృత నేరాలు ఆయుధాలు, వ్యక్తులు, మాదక ద్రవ్యాలు, సాంస్కృతిక ఆస్తి, సహజ వనరులు, వన్యప్రాణుల అక్రమ రవాణా అనేవి ఆర్థిక వనరుగా ఉండవచ్చు.

• ఉగ్రవాదులు క్రిప్టోకరెన్సీ, క్రౌడ్ ఫండింగ్ వంటి టెక్నాలజీలను వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడం ప్రారంభించారు.

• డార్క్ వెబ్ ప్రొఫెషనల్ హ్యాకర్‌లు, క్రౌడ్‌సోర్స్.. ఉగ్రవాదం కోసం నిధులను సమకూర్చాలనుకొన్న వారందరికీ కేంద్రంగా మారారు.

• సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై ప్రపంచానికి ఇప్పటికీ సార్వత్రిక ఏకాభిప్రాయం లేదు.

• సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నియంత్రణ లేకపోవడంతో నిధుల సమకూర్చుకోవడం కోసం ఉగ్రవాదులను వాటిని దుర్వినియోగం చేస్తున్నారు.

• ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు / సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై పర్యవేక్షణ, నియంత్రణ, దిద్దుబాటు వంటి వాటి కోసం పని చేసేందుకు సమర్థవంతంగా పనిచేసేందుకు లెజిస్లేటివ్ ఫ్రేమ్ వర్క్ బాగా పనిచేస్తుంది.

• రాష్ట్రాలకు మరింత సమన్వయం అవసరం

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..