Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆ రాష్ట్రంపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. దేవ్‌నారాయణ్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..

దేవ్‌నారాయణ్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని మలసేరి గ్రామంలో శనివారం ఉదయం 11.30గంటలకు లార్డ్ దేవ్‌నారాయణ్ జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి.

PM Modi: ఆ రాష్ట్రంపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. దేవ్‌నారాయణ్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2023 | 8:50 AM

దేవ్‌నారాయణ్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని మలసేరి గ్రామంలో శనివారం ఉదయం 11.30గంటలకు లార్డ్ దేవ్‌నారాయణ్ జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. గుర్జర్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు దేవ్‌నారాయణ్‌ ను దేవుడిగా కొలుస్తారు. గిరిజన గుర్జర్ కమ్యూనిటీకి పీఠాధిపతి అయిన దేవనారాయణ్ 1111వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతోపాటు పలువురు హాజరుకానున్నారు.

దేవ్‌నారాయణ్‌ను రాజస్థాన్ ప్రజలు దేవుడిగా పూజిస్తారు. ఆయన భక్తులు దేశం నలుమూలలా ఉన్నారు. దేవ్‌నారాయణ్‌ ప్రజాసేవ కోసం చేసిన కృషికి ప్రత్యేక గౌరవం పొందారు. మహావిష్ణువు అవతారంగా భావించే దేవనారాయణుడి జన్మస్థలమైన మలసేరి దుంగ్రి గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ గ్రామం భిల్వారా నుండి 60 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 28వ తేదీ ఉదయం 11.30 గంటలకు రాజస్థాన్‌లోని భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ ‘అవతార మహోత్సవ్’ స్మారక కార్యక్రమంలో ప్రసంగిస్తారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటనలో తెలిపింది.

కాగా, ప్రధాని మోడీ పర్యటనతో రాజస్థాన్‌ బీజేపీలో జోష్ నెలకొంది. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. బీజేపీ లాభం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గుర్జార్ తెగ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా తూర్పు రాజస్థాన్‌లోని అనేక అసెంబ్లీ స్థానాల్లో గుర్జర్ వర్గం గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే, గుర్జార్‌కు చెందిన సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా చేయకపోవడం వల్ల ఆ సంఘం కాంగ్రెస్ పట్ల నిరాశతో ఉందని.. కావున ప్రధానమంత్రి పర్యటన విజయవంతం అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దుంగ్రి గ్రామంలో మకాం వేసి.. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.

సెలవు ప్రకటించిన రాజస్థాన్ ప్రభుత్వం..

భిల్వారాలోని గుర్జర్ దేవుడి మందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ సందర్శనకు ఒక రోజు ముందు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం దేవ్‌నారాయణ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించింది. ఈ ఏడాదికి మాత్రమే ఈ ప్రకటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. సామాన్యుల విశ్వాసం, ప్రజా ప్రతినిధుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..