AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మాస్క్‌లు ధరించండి.. చేతులు శుభ్రం చేసుకోండి.. ప్రజలకు ప్రధాని మోడీ సూచనలు..

చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా తీవ్ర రూపం దాల్చుతుందని.. ప్రజలు వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు వీలుగా నివారణ చర్యలు పాటించాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడాన్ని చూస్తున్నామని.. ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.

PM Modi: మాస్క్‌లు ధరించండి.. చేతులు శుభ్రం చేసుకోండి.. ప్రజలకు ప్రధాని మోడీ సూచనలు..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2022 | 4:56 PM

Share

కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ.. ఈ ఏడాది (2022) చివరి ఎపిసోడ్ ‘మన్ కీ బాత్’ 96వ ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 2022లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించడంతోపాటు.. 2023 సవాళ్ల గురించి కూడా చర్చించారు. 2022 సంవత్సరం అనేక విధాలుగా అద్భుతమైనది.. స్పూర్తిదాయకం అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఆగస్టుతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని.. ఈ సంవత్సరంతో అమృత్ కాలం ప్రారంభమైందని పీఎం మోడీ తెలిపారు. ప్రపంచంలో భారత్ ఐదో ఆర్ధిక శక్తిగా ఎదిగిందని, ఇది సాధారణ విషయం కాదని తెలిపారు. 2022లో భారతదేశానికి 20 కి అధ్యక్షత వహించే బాధ్యత లభించిందని గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో 220 కోట్ల కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశామని వివరించారు.

చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా తీవ్ర రూపం దాల్చుతుందని.. ప్రజలు వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు వీలుగా నివారణ చర్యలు పాటించాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడాన్ని చూస్తున్నామని.. ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్క్ లు ధరించి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని విస్తరించామని.. దీనివల్ల 2022 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోడీ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ రోజు యేసుక్రీస్తు జీవితం, బోధనలను గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళి..

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. మనమందరం ఆరాధించే అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నేడు.. దేశానికి అపూర్వ నాయకత్వాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ అంటూ కొనియాడారు. ప్రతి భారతీయుడి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని.. విద్య, విదేశాంగ విధానం, మౌలిక సదుపాయాలతో సహా ప్రతి రంగంలోనూ వాజ్‌పేయి భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని అన్నారు.

పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రపంచంలోని టాప్-10 కార్యక్రమాలలో నమామి గంగే మిషన్ చేర్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. గంగామాతతో మన సంప్రదాయం, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉందని, ఇది మనకు గర్వకారణమని అన్నారు. ఇది గర్వించదగ్గ విషయమన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రపంచంలోని టాప్-10 కార్యక్రమాలలో నమామి గంగే మిషన్‌ను చేర్చడం గర్వించదగిన విషయమంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..