భారత స్వావలంబన సాధించాలని కోరుకున్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ.. వర్ధంతి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Deendayal Upadhyaya death anniversary: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం..

భారత స్వావలంబన సాధించాలని కోరుకున్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ.. వర్ధంతి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Follow us

|

Updated on: Feb 11, 2021 | 1:43 PM

Deendayal Upadhyaya death anniversary: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘన నివాళులర్పించారు. పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా మోదీతోటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనపథ్‌లోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సేవలను కొనియాడారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆదర్శనీయుడని, స్ఫూర్తి ప్రదాతని పేర్కొన్నారు. భారత అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆలోచనాపరుడని.. అనునిత్యం జాతీయ భావంతో ముందుకు సాగుతూ గొప్ప రాజకీయవేత్తగా ఎదిగారన్నారు. భారత స్వయంస్వాలంబన కోసం ఆయన అనునిత్యం పరితపించారని పేర్కొన్నారు. మన రాజకీయాల్లో కూడా జాతీయ విధానం చాలా ప్రధానమైనదని మోదీ పేర్కొన్నారు. కాగా.. పండిట్ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 1967 డిసెంబర్‌లో జన సంఘ్ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఫిబ్రవరి 11, 1968న కన్నుమూశారు.

Also Read:

Rajya Sabha: అంగుళం భూమిని కూడా వదులుకోం.. అప్పటివరకు చైనాతో చర్చలు: రక్షణమంత్రి రాజ్‌నాథ్

Manasa Varanasi Biography: మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి బయోగ్రఫీ..