AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasa Varanasi Biography: మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి బయోగ్రఫీ..

తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు.

Manasa Varanasi Biography: మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి బయోగ్రఫీ..
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2021 | 1:37 PM

Share

Femina Miss India World 2020:  తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. మానస స్వస్థలం హైదరాబాద్. మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది.

మానస చిన్నతనం నుంచి చాలా సైలెంట్‏గా ఉండే అమ్మాయి. బిడియం ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలు చదవడం, యోగా చేయడం, మ్యూజిక్ వినడం మానసకు ఇష్టమైన పనులు. అలాగే ఆమె ప్రతి చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా, విభిన్నంగా ఆలోచించే అమ్మాయి. భారతనాట్యం, సంగీతం ద్వారా తానెంటో నిరుపించుకుంది. కొత్తగా కలలను మరియు ఆసక్తి కలిగించే విషయాలపట్ల మానస ఎక్కువగా గడుపుతుంది. ఇక ఇదే విషయాలు ఆమె ఇతరులతో తొందరగా కలిసి పోవడానికి సహయపడిందని అంటుంది మానస. నేనేప్పుడు ఆసక్తితో ఉంటాను. ఇంకా అదే నా బెస్ట్ ఫ్రెండ్‏గా భావిస్తాను. ఇది నా భయాలను జయించడంలో నాకు ఎంతగానే సహయపడింది. ప్రతి రోజు సంతోషంగా, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను అని మానస తెలిపింది.

తనలో ఉన్న ఆ ఆసక్తియే తనను NGO- మేక్ ఎ డిఫరెన్స్‏లో భాగం అయ్యేందుకు తోడ్పడింది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో కలవడానికి.. తనలో ఉన్న బిడియాన్ని వదిలిపెట్టాలనే లక్ష్యంతో, ఆమె చిన్నారులకు ఉపాధ్యాయురాలిగా ఉండేందుకు ముందుకొచ్చింది. పిల్లలతో ఉండడం వలన ప్రతి చిరునవ్వు వెనుక, ప్రతి పని వెనక ఒక కథ ఉంటుందని.. ఆ కథలు కొన్నిసార్లు సంతోషంగా, మరికొన్ని సార్లు బాధాగా ఉంటాయని.. అవే మనల్ని మనకు చూపిస్తుందని తెలిపింది. సాధరణంగా మనం బయటకు కనిపించే తీరు, మనం ఇతరులతో వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. కానీ మన భయాలు మరియు బాధలనేవి మన వ్యక్తిగతం. మనసు ఆరోగ్యం ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని.. చాలా మంది తమ మనసును వారే అర్థం చేసుకోవలాలని తెలిపింది.

కళలపై ఆమెకున్న అభిరుచి, ఆమెకు నిజజీవితంలో ఏర్పడిన అనుభవాలతోపాటు, ఆసక్తి, ధైర్యం గురించి చాలా నేర్చుకున్నానని మానస అంటూ ఉంటుంది. NGOలో భాగమైన ఆమె దానిని మరింత స్ట్రాంగ్ అలాగే అతిపెద్ద ఫ్లాట్ ఫాంగా తీర్చిదిద్దేందుకు సహయపడుతుంది. పోటీ ప్రపంచంలో తాను భాగం కావాలనే ఆశతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది మానస.. చివరకు VLCC ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచింది.

Also Read:

Manasa Varanasi: మానస వారణాసి అసలు ఏం చదువుకుంది.. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఎంటంటే ?