Manasa Varanasi: మానస వారణాసి అసలు ఏం చదువుకుంది.. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఎంటంటే ?
తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో
Femina Miss India 2020 Winner: తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా యువతి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు.
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచిన మానస వారణాసి వయసు 23 సంవత్సరాలు. పుట్టింది హైదరాబాద్‌లోనే. మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.
Also Read: