India Deaths: భారత్‌లో ప్రతియేటా 27 లక్షల మరణాలు.. అసలు కారణం ఇదే.. నివేదికలో తేల్చిన ప్రముఖ సంస్థలు
India Deaths: భారతదేశంలో ప్రతి ఏడాది సంభవిస్తున్న మరణాల్లో 30 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేనని ఓ నివేదిక తేల్చింది. ప్రతి ఏటా దాదాపు...
India Deaths: భారతదేశంలో ప్రతి ఏడాది సంభవిస్తున్న మరణాల్లో 30 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేనని ఓ నివేదిక తేల్చింది. ప్రతి ఏటా దాదాపు 27 లక్షల మంది విషవాయులు పీల్చడం వల్ల మరణిస్తున్నారని హార్వర్డ్ విద్యాలయం, కాలేజ్ ఆఫ్ లండన్ విశ్వ విద్యాలయంతో పాటు మరికొన్ని ప్రముఖ సంస్థలు జరిపిన అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించి వివరాలు ప్రముఖ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.
బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం కారణంగా వెలువడే కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా 2018లో 80 లక్షల మంది మృతి చెందినట్లు అధ్యయనం వెల్లడించింది. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం వల్లేనని స్పష్టం చేసింది. ఈ సంఖ్య అంచనాల కంటే ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇక దుమ్ము, పొగ, కార్చిచ్చు, పంట వ్యవర్థాల దహనం వల్ల గాల్లో కలిసిపోయే సూక్ష్మమైన రేణువుల వల్ల 42 లక్షల మంది చనిపోతున్నట్లు తేలింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాల వల్ల సంభవిస్తున్న మరణాల్లో భారత్, చైనాలోనే అత్యధికమని అధ్యయనం తెలిపింది. చైనా ఏటా 39.1 లక్షలు, భారత్‌లో 24.6 లక్షల మంది చనిపోతున్నట్లు పేర్కొంది. భారత్‌లో 2018లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 4,71,546 మంది, బీహర్‌లో 2,88,821 మంది మృతి చెందినట్లు నివేదిక తెలిపింది.
మహారాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య ‘టఫ్ వార్’, కోష్యారీ విమాన ప్రయాణానికి థాక్రే సర్కార్ నో పర్మిషన్