PM Modi: రోడ్ షోలో అడుగడున పూల వర్షం.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన కాశీ ప్రజలు

|

May 13, 2024 | 9:06 PM

దేశవ్యాప్తంగా నాల్గోవ దశ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన నియోజకవర్గమైన వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. మంగళవారం (మే 14) ఉత్తరప్రదేశ్ స్థానం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

PM Modi:  రోడ్ షోలో అడుగడున పూల వర్షం.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన కాశీ ప్రజలు
Pm Modi In Varanasi Mega Road Show
Follow us on

దేశవ్యాప్తంగా నాల్గోవ దశ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన నియోజకవర్గమైన వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. మంగళవారం (మే 14) ఉత్తరప్రదేశ్ స్థానం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాశీ ప్రజల అద్భుతమైన ఆప్యాయతకు రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 1న ఏడో, చివరి దశలో వారణాసిలో ఓటింగ్ జరగనుంది.

వారణాసి నుంచి ప్రధాని మోదీ వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు హిందూ మహాసభ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ ముఖ్యనేతలు ఉన్నారు. మాళవియా స్క్వేర్ నుంచి శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ వరకు రోడ్ షో జరిగింది. ఇది సంత్ రవిదాస్ గేట్, అస్సి, శివాల, సోనార్‌పురా, జంగంబాడి, గొదౌలియా గుండా సాగింది. దారి పొడవునా శ్రీరాములు నినాదాలు మిన్నంటాయి. BLW గెస్ట్‌హౌస్‌లో ప్రధాని రాత్రి బస చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Modi In Varanasi

వారణాసిలో ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్న స్థానికులు ఇంత మంచి సన్నాహాలు ఇంతకు ముందెన్నడూ జరగలేదన్నారు. కాశీ ప్రజల కలయిక చారిత్రాత్మకమైనదని, గత పదేళ్లలో వారణాసిలో చాలా అభివృద్ధిని చూశామని, ఇదంతా ప్రధాని మోదీ వల్లేనని అంటున్నారు. ఈసారి కూడా మోదీ తథ్యమన్నారు. మోదీ వారణాసికి ఎంపీగా ఉండటం గర్వకారణంగా స్థానికులు చెబుతున్నారు.

కమలం పువ్వుతో కూడిన కుర్తా, తెల్లని సద్రీ ధరించి ప్రత్యేక, బహిరంగ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. ఇది చాలా మంచి అనుభూతి అని అన్సార్ ఉల్ హక్ అన్నారు. వారణాసిలో, ముస్లిం నాయకుడు ఇంతియాజ్ జమాఖా మాట్లాడుతూ, “ముస్లింల పట్ల ప్రధాని మోడీ స్వభావం మొదటి నుండి ప్రశంసించదగినది,” అని ఒక ముస్లిం మహిళ మాట్లాడుతూ, “మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము, కాబట్టి మేము రాత్రంతా ప్రధాని మోడీకి స్వాగతం పలికాము.”అన్నారు.

Varanasi Mega Road Show

వారణాసి చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 400 దాటాలన్న ప్రధాని మోదీ, పార్టీ సంకల్పాన్ని నెరవేరుస్తాం. ముస్లింల పట్ల ప్రధాని మోదీ తీరు మొదటి నుంచి ప్రశంసనీయమని మరొకరు అన్నారు. వారణాసి స్థానిక ప్రజలు 2014, 2019 రోడ్ షోల కంటే ఈసారి రోడ్ షోలో ఎక్కువ మంది తరలివచ్చారు. గతంలో 2014, 2019లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన మోదీ ఈసారి మూడోసారి ఇక్కడ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఈసారి ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘజియాబాద్ నుంచి రోడ్ షో ప్రారంభించిన మోదీ.. ఆ తర్వాత కాన్పూర్, బరేలీ, అయోధ్యలో కూడా రోడ్ షోలు చేశారు. ఈ ప్రదేశాలన్నింటిలో, మోదీ వాహనం ఎక్కిన వెంటనే, భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు, కమలంతో ప్రజలకు అభివాదం చేసేవారు. కానీ తన పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం చేతిలో కమలం పట్టుకోకుండా, ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేయడం కనిపించింది. ఈ ఆరు కిలోమీటర్ల రోడ్ షోలో షెహనాయ్ ధ్వనులు, శంఖుస్థాపనలు, డప్పుల దరువులు, మంత్రోచ్ఛారణల నడుమ యాత్ర అంతా కాశీ సంస్కృతిలో మునిగితేలింది.

ప్రధానమంత్రి, వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ మే 14న వారణాసి నుంచి మూడోసారి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇక్కడ నుంచి ఆయన గెలుపు దాదాపు ఖాయమని భావించినా, గెలుపు మార్జిన్ ఎంత పెద్దది అవుతుందో చూడాలి. వారణాసి లోక్‌సభ ఎన్నికల విశేషమేమిటంటే.. ప్రధాని మోదీ అభ్యర్థిత్వమే ప్రత్యేకత. అయితే.. వారణాసికి వచ్చి మోదీకి సవాల్‌ విసిరి మోదీని తట్టుకునే నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.

మోదీ మెగా రోడ్ షో వీడియో చూడండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…