Narendra Modi: ‘పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి’.. ప్రకృతి సంరక్షణ కోసం ప్రధాని మోదీ పిలుపు..

| Edited By: Shaik Madar Saheb

Jun 27, 2023 | 11:13 AM

Narendra Modi: ప్రపంచం పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం చేపట్టిన ‘My India My LiFE Goals’ కార్యక్రమంలో టీవీ9 కూడా భాగస్వామిగా ఉంది. పర్యావరణం పచ్చగా ఉంటేనే..

Narendra Modi: ‘పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి’.. ప్రకృతి సంరక్షణ కోసం ప్రధాని మోదీ పిలుపు..
PM Modi calls for putting end to single-use plastic
Follow us on

Narendra Modi: ప్రపంచం పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం చేపట్టిన ‘My India My LiFE Goals’ కార్యక్రమంలో టీవీ9 కూడా భాగస్వామిగా ఉంది. పర్యావరణం పచ్చగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉండగలరు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా జూన్‌ 5 యావత్‌ ప్రపంచం పర్యావరణ దినోత్సవంలో భాగమవుతుంది. జూన్‌ 5, 1973 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. అంటే ఈసారి జరుపుకుంటున్నది 50వది. ఈ సంవత్సర భారత్‌ నినాదం లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ – లైఫ్‌.  పర్యావరణ హితం కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో భాగస్వామిగా నిలుస్తున్నందుకు టీవీ9 గర్విస్తోంది.

ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్ వేదికగా ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రధాని మోదీ ఈ సందర్భంగా సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని మోదీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం పాటు పడాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


కాగా, ‘మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌’ పేరుతో ఈ ఏడాది పర్యావరణ ఉద్యమాన్ని చేపట్టింది భారత్‌. ఈ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చేపట్టిన ఈ ఉద్యమం జీవనశైలిలో పర్యావరణాన్ని భాగం చేసుకొని సూచిస్తోంది. దీనికి లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ అని నామకరణం చేశారు. పర్యావరణం విషయంలో దేశ ప్రజల్లో అవగాహన పెంచి పర్యావరణ సంరక్షణలో వారిని భాగం చేయడం ఈ ఉద్యమ లక్ష్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..