మెట్రో ఆక్వా లైన్ షురూ.. ముంబై మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి: ప్రధాని మోదీ
ముంబై మెట్రో లైన్ 3 చివరి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో కలల నగరంలో ప్రయాణం గతంలో కంటే సులభం, వేగంగా.. మరింత సౌకర్యవంతంగా మారింది. ఈ దశ అత్రే చౌక్ నుండి కఫే పరేడ్ వరకు విస్తరించింది. దీనిని రూ. 12,200 కోట్లు వ్యయంతో నిర్మించారు. మొత్తం మెట్రో లైన్ 3 (ఆక్వా లైన్) మొత్తం ఖర్చు రూ. 37,270 కోట్లు.

ముంబై మెట్రో లైన్ 3 చివరి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో కలల నగరంలో ప్రయాణం గతంలో కంటే సులభం, వేగంగా.. మరింత సౌకర్యవంతంగా మారింది. ఈ దశ అత్రే చౌక్ నుండి కఫే పరేడ్ వరకు విస్తరించింది. దీనిని రూ. 12,200 కోట్లు వ్యయంతో నిర్మించారు. మొత్తం మెట్రో లైన్ 3 (ఆక్వా లైన్) మొత్తం ఖర్చు రూ. 37,270 కోట్లు.
ముంబై మెట్రో లైన్ 3 దశ 2B ప్రారంభంతో ముంబై మౌలిక సదుపాయాలకు గణనీయమైన మెరుగుపడుతున్నాయని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏ నగర అభివృద్ధికి అయినా మెట్రో కనెక్టివిటీ చాలా అవసరం. ఈ ప్రాజెక్ట్ ముంబైవాసుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ముంబైలోని మొట్టమొదటి పూర్తిగా భూగర్భ మెట్రో లైన్ ఇది. 33.5 కిలోమీటర్ల పొడవు, 27 స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ దాదాపు 1.3 మిలియన్ల మంది ఈ మెట్రోలో ప్రయాణిస్తారు.
ప్రయాణికులకు బహుళ ప్రజా రవాణా ఆపరేటర్లకు ఇంటిగ్రేటెడ్ మొబైల్ టికెటింగ్ సహా అనేక ప్రయోజనాలను అందించే ముంబై వన్ యాప్‌ను కూడా మోదీ ప్రారంభించారు. మహారాష్ట్ర నైపుణ్యాలు, ఉపాధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణల శాఖ స్వల్పకాలిక ఉపాధి కార్యక్రమం (STEP)ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 400 ప్రభుత్వ ఐటీఐలు మరియు 150 ప్రభుత్వ సాంకేతిక ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఉపాధిని పెంపొందించడానికి, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రధాన అడుగు.
ఈ సందర్భంగా ముంబై సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిపోయిందని ప్రధాని మోదీ మరాఠీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ముంబైకి రెండవ ప్రధాన విమానాశ్రయం, భూగర్భ మెట్రో వచ్చింది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ప్రజల సమయాన్ని ఆదా చేస్తుంది” అని ఆయన అన్నారు.
Phase 2B of the Mumbai Metro Line-3 is a significant enhancement to Mumbai’s infrastructure!
Metro connectivity is essential for a city’s growth. This project will have a positive impact on the lives of the people of Mumbai. https://t.co/aKmhc9RtUk pic.twitter.com/ing6Mb3xD4
— Narendra Modi (@narendramodi) October 8, 2025
ప్రయాణం సులభతరం
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు 2017లో ప్రారంభమయ్యాయి. భారతదేశంలో తొలిసారిగా, 17 టన్నెల్ బోరింగ్ యంత్రాలు (TBMలు) ఒకేసారి మోహరించి పని చేశాయి. ఆక్వా లైన్ CSMT వద్ద సెంట్రల్ రైల్వేకు, ముంబై సెంట్రల్, చర్చిగేట్ వద్ద వెస్ట్రన్ రైల్వేకు అనుసంధానిస్తుంది. ఇంటర్‌మోడల్ ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది. ఈ లైన్ నారిమన్ పాయింట్, ఫోర్ట్, కల్బాదేవి, RBI, BSE, రాష్ట్ర సచివాలయానికి ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. నగరంలోని ప్రధాన వ్యాపార, పరిపాలనా ప్రాంతాలలో పనిచేసే నిపుణులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
ప్రయాణ ఛార్జీలు ఎంత..?
ఈ మార్గం దక్షిణ ముంబై నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా మెట్రో యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది విమాన ప్రయాణికులకు పెద్ద ఉపశమనం. 3 కి.మీ వరకు ప్రయాణించే ప్రయాణీకులు ₹10 ఛార్జీని చెల్లిస్తారు. 3 కి.మీ నుండి 12 కి.మీ మధ్య ప్రయాణించే వారు ₹20 చెల్లించాల్సి ఉంటుంది. 12 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల మధ్య ప్రయాణించే వారికి రూ.30, 18 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల మధ్య ప్రయాణించే వారికి రూ.40, 24 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు రూ.50, 30 కిలోమీటర్ల నుంచి 36 కిలోమీటర్లకు రూ.60గా ఛార్జీని నిర్ణయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




