World Universities Championship: ప్రపంచ పోటీల్లో సత్తా చాటిన భారత క్రీడాకారులు.. ప్రధాని మోదీ అభినందనలు

| Edited By: Shaik Madar Saheb

Aug 08, 2023 | 10:18 PM

అంతర్జాతీయ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటారు. చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 26 మెడల్స్ సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. వాస్తవానికి 2023కు ముందు అన్ని వరల్డ్ యూనివర్సిటీస్ ఛాంపియన్‌షిప్‌లలో కలిపి ఇండియాకు కేవలం 21 పతకాలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి జరిగిన పోటీల్లో మన క్రీడాకారులు రికార్డులు తిరగరాశారు.

World Universities Championship:  ప్రపంచ పోటీల్లో సత్తా చాటిన భారత క్రీడాకారులు.. ప్రధాని మోదీ అభినందనలు
Pm Modi And Athletes
Follow us on

అంతర్జాతీయ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటారు. చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 26 మెడల్స్ సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. వాస్తవానికి 2023కు ముందు అన్ని వరల్డ్ యూనివర్సిటీస్ ఛాంపియన్‌షిప్‌లలో కలిపి ఇండియాకు కేవలం 21 పతకాలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి జరిగిన పోటీల్లో మన క్రీడాకారులు రికార్డులు తిరగరాశారు. ఇంతకు ముందు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లుగా ఈసారి అద్భుత ప్రదర్శను కనబర్చారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యద్బుతమైన ప్రదర్శనలతో దేశాన్ని గర్వించేలా చేసిన క్రీడాకారుల బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో రాబోయే అథ్లేట్లకు ఎంతో ఆదర్శంగా నిలిచారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఇండియాకు 26 మెడల్స్ రాగా.. అందులో మన క్రీడాకారులు 11 బంగారు పతకాలు సాధించారు. అలాగే 5 సిల్వర్, 10 బ్రోంజ్ పతకాలు కైవసం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి