రేపిస్టులకు ఇక ఆ అవకాశం ఉండదు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

దేశంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాగే సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబప్/జనవరి నాటికి ఆ ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్, తెలంగాణ. మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.

రేపిస్టులకు ఇక ఆ అవకాశం ఉండదు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Jobs
Follow us
Aravind B

|

Updated on: Aug 08, 2023 | 9:56 PM

దేశంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాగే సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబప్/జనవరి నాటికి ఆ ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజస్థాన్, తెలంగాణ. మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారం కోసం అన్ని పార్టీల నేతలు తమ ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలను పన్నుతున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కొనసాగిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తమ అధికారాన్ని మళ్లీ సొంతం చేసుకోవడంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు కాంగ్రెస్ పార్టీ కసరత్తలు ప్రారంభించింది.

రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక హామీలు ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మహిళలు, యువతులు, మైనర్లపై అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది. అత్యాచారం చేసిన నిందితులు, లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల నుంచి నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా కీలక ప్రకటన చేశారు. అలాగే తక్షణమే ఈ చర్యలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడినా లేదా అత్యాచారానికి ప్రయత్నించినా, మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి చేసిన లేక వారిపై లైంగిక దాడులు చేసిన కూడా ఈ నిషేధం వారిపై వర్తిస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్లలోని పోలీసులు వారిపై హిస్టరీ షీట్లను ఒపెన్ చేస్తారు. ఈ షీట్ల తరహాలోనే ప్రత్యేకంగా రేపిస్టుల కోసం కొత్తగా రికార్డులు తెరవనున్నారు.

రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై చాలామంది తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నిబంధన వల్ల ఆడవారిపై జరిగే దురాగతాలను కొంతవరకైనా కట్టడి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ మహిళలు అత్యాచారాలు లేదా లైంగిక వేధింపులకు బలవుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని శిక్షలు వేసిన కూడా ఇలాంటి దారుణాలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చానీయాంశమైంది.

ఇవి కూడా చదవండి
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!