Fact Check: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ ఉన్నట్లు కమిటీ సభ్యుడు చెప్పారా? ఈ కథనాల్లో నిజమెంత..

| Edited By: Janardhan Veluru

Mar 20, 2023 | 4:19 PM

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన విధానాన్ని నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజె ప్రసంశించినట్లు జాతీయ మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.

Fact Check: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ ఉన్నట్లు కమిటీ సభ్యుడు చెప్పారా? ఈ కథనాల్లో నిజమెంత..
PM Modi
Follow us on

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన విధానాన్ని నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజె ప్రసంశించారు. శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంతో ఆయన ఎప్పుడూ ముందుంటారంటూ మోదీని ప్రశంసల్లో ముంచెత్తినట్లు కథనాలు వచ్చాయి. దేశం మాట్లాడితే ప్రపంచం వింటుందని భారతదేశ గొప్పదనాన్ని కొనియాడినట్లు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలు ప్రయోగించకుండా ప్రధాని మోదీ సానుకూల వ్యవహరించారు. భారత్‌ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఈ విధమైన సందేశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మోదీ కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ప్రపంచంలోని సీనియర్‌ రాజనీతిజ్ఞుల్లో మోదీ ఒకరు. కోవిడ్‌ వంటి గడ్డు పరిస్థితులను తట్టుకుని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా దేశాన్ని కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచదేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. భారత్‌ ప్రపంచంలోని కీలక ఆర్థిక వ్యవస్థలలో ఎదుగుతోంది. ఏ దేశాన్ని ఒత్తిడి చేయకుండా, ఏ ఒక్కరినీ బెదిరించకుండా తమ స్నేహపూర్వక వైఖరితో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగడానికి మోదీ అమలు చేస్తున్న విధానాలే ప్రధాన కారణం. ఈ విధమైన వైఖరి అంతర్జాతీయ రాజకీయాలకు అవసరం. భారత్‌ ఒక సూపర్ పవర్‌గా అవతరించాలి. యుద్ధాలను సైతం ఆపగల సత్తా ఉన్న నాయకుడు మోదీ. ఆయన మాత్రమే శాంతిని నెలకొల్పగలరని’ అస్లే టోజె వ్యాఖ్యానించారన్నది ఆ కథనాల సారాంశం.

అయితే ప్రధాని మోదీ నెబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నట్లు తాను అన్నట్లు తాను వచ్చిన కథనాల్లో వాస్తవం లేదంటూ అస్లే టోజెె తాజాగా వివరణ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని, పుకార్లకు బలం చేకూర్చేలా ఆ అంశంపై చర్చకు తాను సిద్ధంగాలేనని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

అస్లే టోజె వివరణ ఇది..

కాగా నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. శాంతిని పెంపొందించడానికి గణనీయమైన కృషి చేసిన వారికి ఈ బహుమతితో సత్కరిస్తుంటారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ పేరు తెరపైకి రావడం ఇదేం తొలిసారికాదు. గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతికి మోదీ ఎంపికకావచ్చనే అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చణీయాంశమైంది.

( ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు, పలు ప్రాంతీయ, జాతీయ డిజిటల్ మీడియాలో ప్రచురితమైన కథనాలు ఆధారంగా టీవీ9లో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయబడింది. అయితే అస్లే టోజె వివరణ మేరకు.. ఈ కథనాన్ని సవరించబడింది.)

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.