AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 13 నుండి 15 వరకు.. 3 రోజుల్లో 5 రాష్ట్రాలు.. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. సెప్టెంబర్ 13 నుండి 15 వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో రూ. 70,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, పలు పనులకు శంకుస్థాపనలు చేస్తారు. మోదీ వివిధ బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. అలాగే అస్సాంలో భూపేన్ హజారికా జయంతి వేడుకలకు హాజరవుతారు. బీహార్‌లో మఖానా బోర్డును ప్రారంభిస్తారు.

సెప్టెంబర్ 13 నుండి 15 వరకు.. 3 రోజుల్లో 5 రాష్ట్రాలు.. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన
Pm Modi
Balaraju Goud
|

Updated on: Sep 12, 2025 | 3:18 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13 నుండి 15 వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయన మొదట సెప్టెంబర్ 13 శనివారం మిజోరంను సందర్శించి, ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతారు. అక్కడ ే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. దీని తరువాత, ప్రధాని మణిపూర్‌ను సందర్శించి, మధ్యాహ్నం 12:30 గంటలకు చురచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

ఇంఫాల్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రధాని 1,200 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత, సాయంత్రం 5 గంటలకు అస్సాం చేరుకుని, గువాహటిలో జరిగే భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 14న, అస్సాంలో 18,530 కోట్ల రూపాయల విలువైన ప్రధాన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఉదయం 11 గంటలకు ఆయన దరాంగ్‌లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ప్రధానమంత్రి మోదీ మధ్యాహ్నం 1:45 గంటలకు గోలాఘాట్‌లో అస్సాం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నుమాలిఘర్ రిఫైనరీ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. గోలాఘాట్‌లో పాలీప్రొఫైలిన్ ప్లాంట్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. సెప్టెంబర్ 15న, ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్‌ను సందర్శిస్తారు. ఉదయం 9:30 గంటలకు కోల్‌కతాలో 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను ప్రారంభిస్తారు.

బెంగాల్ పర్యటన తర్వాత ప్రధాని బీహార్‌కు బయలుదేరి, మధ్యాహ్నం 2:45 గంటలకు పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. దీంతో పాటు, పూర్ణియాలో దాదాపు రూ. 36,000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి, ప్రారంభిస్తారు. బీహార్‌లో జాతీయ మఖానా బోర్డును కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ బోర్డు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. పంటకోత నిర్వహణను బలోపేతం చేస్తుంది. ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తుంది. మఖానా మార్కెట్, ఎగుమతి, బ్రాండ్ అభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఇది బీహార్ తోపాటు దేశంలోని మఖానా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

దేశంలోని మొత్తం మఖానా ఉత్పత్తిలో బీహార్ దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. మధుబని, దర్భంగా, సీతామర్హి, సహర్సా, కతిహార్, పూర్నియా, సుపాల్, కిషన్‌గంజ్, అరారియా వంటి ప్రధాన జిల్లాలు మఖానా ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు. ఎందుకంటే ఈ జిల్లాల వాతావరణం, సారవంతమైన నేల మఖానా అద్భుతమైన నాణ్యతకు దోహదం చేస్తాయి. బీహార్‌లో మఖానా బోర్డు స్థాపన రాష్ట్రంలో.. దేశంలో మఖానా ఉత్పత్తిని బాగా పెంచుతుంది. ఈ రంగంలో ప్రపంచ పటంలో బీహార్ ప్రతిష్టను బలోపేతం చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..