AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహానటి.. భర్తను పులి చంపిందని భలే నాటకం! అసలు మ్యాటర్‌ తెలిస్తే.. షాక్‌ అవుతారు!

కర్ణాటకలోని హున్సూర్‌లో ఓ భార్య తన భర్తను విషం ఇచ్చి చంపి, పులి దాడి జరిగిందని నటించింది. క్షతిపూర్తి కోసం ఈ నేరం చేసిందని పోలీసుల విచారణలో బయటపడింది. భర్త మృతదేహం ఇంటి వెనుక గుంటలో దొరికింది. అడవి జంతువుల దాడికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు.

మహానటి.. భర్తను పులి చంపిందని భలే నాటకం! అసలు మ్యాటర్‌ తెలిస్తే.. షాక్‌ అవుతారు!
Wife And Husband(file)
SN Pasha
|

Updated on: Sep 12, 2025 | 2:54 PM

Share

ఈ మధ్య కాలంలో భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు ఎ‍క్కువ అవుతున్నాయి. విభేదాల వల్లనో, లేక వివాహేతర సంబంధాల కారణంగానో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మరో చోట ఓ భార్య తన భర్తను చంపేసింది. పైగా పులి అతనిపై దాడి చేసి చంపిందని నమ్మించింది. అయితే అందుకు కారణం వివాహేతర సంబంధం కాదు.. పరిహారం. అవును మీరు విన్నది నిజమే. అడవి జంతువు దాడి చేసి చంపితే నష్టపరిహారం వస్తుందని భావించిన ఓ మహిళ తన భర్తను చంపి, పులి చంపిందంటూ నాటకం ఆడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కర్ణాటక జిల్లాలోని హున్సూర్ తాలూకాలోని చిక్కహెజ్జూర్‌లో ఈ సంఘటన జరిగింది. భార్య సల్లపురి వెంకటస్వామి (45)కు విషం ఇచ్చి హత్య చేసింది. ఆ తర్వాత అడవి జంతువుల దాడి వల్లే అతను చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయట్నం చేసింది. అలా చేస్తే తనకు పరిహారం లభిస్తుందని ఆశ పడింది. ఈ ఘటనపై హున్సూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దంపతులు వారి వరి పొలంలో పనిచేసుకుంటూ ఉండగా తన భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడని భార్య ఫిర్యాదు చేసింది. గత సోమవారం గ్రామంలో ఒక పులి కనిపించింది. తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపించడం లేదని, ఆ పులి అతన్ని చంపి లాక్కెళ్లిందని ఆమె నటించింది.

పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు, కానీ ఎటువంటి జంతువు ఆనవాళ్లు కనిపించలేదు. అనుమానం వచ్చి ఇంట్లో సోదా చేసిన పోలీసులు ఒక్క క్షణం షాక్ అయ్యారు. ఎందుకంటే వెంకటస్వామి మృతదేహం ఇంటి వెనుక ఉన్న గుంటలో కనిపించింది. విచారణలో వెంకటస్వామి భార్య సల్లపురి అసలు నిజం బయటపెట్టింది. నిందితుడు సల్లపురి తాను అడవి జంతువుల దాడి వల్ల చనిపోయాడని నమ్మిస్తే లక్షల రూపాయలు పరిహారంగా అందుతుందని ఆశతో ఇలా చేశానంటూ ఒప్పకుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి