AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 2 రోజులు.. 4 రాష్ట్రాలు.. పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం.. పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 7,8 తేదీల్లో మొత్తం 4 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌లో మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సుమారు సుమారు 36 గంటల్లో 5 నగరాల్లో దాదాపు డజనకు పైగా అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు.

PM Modi: 2 రోజులు.. 4 రాష్ట్రాలు.. పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం.. పూర్తి షెడ్యూల్ ఇదే
Prime Minister Narendra Mod
Basha Shek
|

Updated on: Jul 04, 2023 | 6:35 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 7,8 తేదీల్లో మొత్తం 4 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌లో మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సుమారు సుమారు 36 గంటల్లో 5 నగరాల్లో దాదాపు 12 అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 4 రాష్ట్రాల్లో మొత్తం రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు. రాయ్‌పూర్, గోరఖ్‌పూర్, వారణాసి, వరంగల్, బికనీర్ నగరాల్లో సుమారు 50 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన షెడ్యూల్‌ విషయానికి.. ముందుగా 7వ తేదీన, ప్ర‌ధాన మంత్రి ఢిల్లీ నుండి రాయ్‌పూర్‌కు వెళతారు. అక్కడ ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. రాయ్‌పూర్‌- విశాఖపట్నం ఆరులైన్ల కారిడార్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆపై ప్రధాని గోరఖ్‌పూర్‌కు వెళతారు. అక్కడ గీతా ప్రెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ.

వరంగల్‌తో పాటు..

గోరఖ్‌పూర్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి తన సొంత నియోజకవర్గం వారణాసికి వెళతారు. అక్కడ పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌ను జాతికి అంకితం చేస్తారు. అలాగే NH56 (వారణాసి – జౌన్‌పూర్) నాలుగు లేన్ల కారిడార్‌ను కూడా జాతికి అంకితం చేస్తారు. అలాగే మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ పునరుద్ధరణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇక 8వ తేదీన ప్ర‌ధాన మంత్రి వార‌ణాసి నుంచి తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్‌కు రానుననారు. ఇక్కడ, నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌లోని కీలక విభాగాలతో సహా వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఎన్‌హెచ్-563లో కరీంనగర్ – వరంగల్ సెక్షన్ నాలుగు లేనింగ్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత, వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.

బికనీర్‌లో…

వరంగల్‌ పర్యటన అనంతరం ప్రధాని మోడీ బికనీర్‌కు వెళతారు. అక్కడ బహుళ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అమృత్‌సర్ జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వేలోని వివిధ విభాగాలను, గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-I కోసం ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే బికనీర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బికనీర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..