G20 Summit: కుటుంబం కంటే దేశం ముఖ్యం.. తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కి ప్రధాని ధన్యవాదాలు

|

Sep 23, 2023 | 7:50 PM

అద్భుతంగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఢిల్లీ పోలీసు సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రగతి మైదాన్‌లో విందు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల ఉద్యోగులను విందుకు ఆహ్వానించారు. ఇందులో కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు 275 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని పిలిచారు. ఈ విందు కంటే ముందు జీ-20లో విధుల్లో పాల్గొన్నవారితో అనుభవాలను చెప్పాలని ప్రధాని కోరారు. ఆసమయంలో ఏ పోలీస్ చెప్పిన మాటలకు ప్రధాని మోదీ..

G20 Summit: కుటుంబం కంటే దేశం ముఖ్యం.. తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కి ప్రధాని ధన్యవాదాలు
Pm Modi Praises Delhi Police Inspector
Follow us on

న్యూఢిల్లీ, సెప్టంబర్ 23: న్యూఢిల్లీలో జరిగిన జీ-20లో సదస్సు కోసం అహర్నిశలు పని చేసిన ఉద్యోగులకు ప్రధాని మోదీ విందు ఇచ్చారు. అద్భుతంగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఢిల్లీ పోలీసు సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రగతి మైదాన్‌లో విందు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల ఉద్యోగులను విందుకు ఆహ్వానించారు. ఇందులో కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు 275 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని పిలిచారు. ఈ విందు కంటే ముందు జీ-20లో విధుల్లో పాల్గొన్నవారితో అనుభవాలను చెప్పాలని ప్రధాని కోరారు.

తమ అనుభవాలను వారు ప్రధాని మోదీతో పొచుకున్నారు. దేశంలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్న భారత్ మండపంలో తన డ్యూటీ ఉందని ఇన్‌స్పెక్టర్ సురేష్ చెప్పారు. సెప్టెంబరు 9న అతని తల్లి ఫూల్పతి దేవి (74) గుండెపోటుకు గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. ఇది విన్న తర్వాత కూడా ఆసుపత్రికి వెళ్లకుండా డ్యూటీ చేస్తూనే ఉన్నారు సురేష్.

ఇవి కూడా చదవండి

అతను ప్రధాన వేదిక వద్ద భద్రతలో ఉన్నారు. చాలా కీలకమైన బాధ్యతల్లో తాను విధిని నిర్వహిస్తుండటంతో ఇంటికి వెళ్లకుండా పనిలో ఉండిపోయారు. అతను తన కుటుంబం కంటే ముందు తన దేశాన్ని ఎంచుకున్నాడు. ఇంటికి వెళ్ళే ముందు తన బాధ్యతలను పూర్తిగా నిర్వహించి.. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు.. అప్పటి వరకు తాను డ్యూటీ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ విషయం విన్న వెంటనే ప్రధాని మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు.

తన అనుభవాన్ని ఇన్‌స్పెక్టర్‌తో చెప్పమని అడిగినప్పుడు, అతను తన తల్లిని కోల్పోయిన బాధలో తన విధులను నిర్వర్తించాడని పేర్కొన్నాడు. విధి నిర్వహణలో ఆయనకున్న అంకితభావాన్ని మోదీ ప్రశంసించారు. భారత్ మండప్ సమావేశ మందిరంలో భద్రతను నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్‌తో తన అనుభవాన్ని పంచుకోమని మోదీ చెప్పారు. సురేశ్‌జీకి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ అనుభవాన్ని విన్న ప్రధాని ఉద్వేగానికి లోనైన సురేష్ కుమార్ తన తల్లి స్వర్గానికి వెళ్లిపోయారని చెప్పారు. అలాంటి కొడుకు పుట్టాడని అతని తల్లి గర్విస్తుంది. దేశం కోసం కర్తవ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం గర్వకారణమని ప్రధాని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం