One Nation-One Election: జమిలీ ఎన్నికలపై చర్చించేందుకు తొలిసారిగా భేటీ కానున్న కమిటీ..
ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులను వేగవంతం చేసింది. వాస్తవానికి ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా దీనిపై చర్చ జరుగుతుందని అందురూ అనుకున్నారు. కానీ కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకురావడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్‌ను నిర్వహించిందని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ సమావేశంలో ఒక్కసారి కూడా జమిలి ఎన్నికలపై ఎటువంటి ప్రస్తావన రాలేదు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యూహం అన్నది ఏంటీ అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులను వేగవంతం చేసింది. వాస్తవానికి ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా దీనిపై చర్చ జరుగుతుందని అందురూ అనుకున్నారు. కానీ కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకురావడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్‌ను నిర్వహించిందని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ సమావేశంలో ఒక్కసారి కూడా జమిలి ఎన్నికలపై ఎటువంటి ప్రస్తావన రాలేదు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యూహం అన్నది ఏంటీ అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే.. ఒకేసారి ఎన్నికలు నిర్వహిచడం సాధ్యమేనా..అనే అంశంపై తొలిసారిగా కోవింద్ కమిటీ శనివారం భేటీ అవుతుండడం మరింత ఉత్కంఠ పెంచుతోంది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడినటువంటి ఓ ప్రత్యేక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అంతేకాదు ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ చర్చలు జరపనుంది. అయితే ఈ కమిటీ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేయనుంది. మరోవిషయం ఏంటంటే ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఈ కమిటీలోని సుమారు 8 మంది సభ్యుల పేర్లను బయటపెట్టింది. అయితే వీళ్లందరికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించనున్నారు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా లేదా అనే విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం రాజ్యాంగంలో ఏవైన సవరణలు చేయాల్సి ఉంటుందా లేదా అనే విషయాలపై చర్చలు జరపనున్నారు కమిటీ సభ్యులు. అయితే ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం.. ఒకే దేశం, ఒకే ఎన్నికపై తమ కసరత్తు చేస్తున్న క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇటువంటి సంకేతాలను ఇచ్చారు. అలాగే కొందరు కాంగ్రెస్ లీడర్లు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి ఆలస్యం జరిగే అవకాశాలు కూడా ఉండవని చెప్పారు. ప్రభుత్వ గడువు ముగిసేవరుక ప్రధాని మోదీ సేవలు అందిస్తారని చెప్పారు. మరోవైపు తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటిస్తుందని.. ఎన్నికలకు రెండు, మూడు నెలలు మాత్రమే సమయం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం