ఉద్యోగం నుంచి తీసేసిన యజమాని.. ప్రతీకారం తీర్చుకున్న యువతి..
పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతంలో జరిగిన ఓ ఉందంతం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. స్థానికంగా ఓ పిజ్జాషాప్‌ను నిర్వహిస్తున్నటువంటి ఓ జంటకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది. అయితే ఈ అంశంపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నమోదు అయ్యింది. అయితే వాస్తవానికి ఈ వీడియో ఫేక్ అని.. కొందరు ఉద్దేశపూర్వకంగా కావాలనే దాన్ని ఎడిట్ చేశారని ఆ దంపతులు అంటున్నారు.

పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతంలో జరిగిన ఓ ఉందంతం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. స్థానికంగా ఓ పిజ్జాషాప్‌ను నిర్వహిస్తున్నటువంటి ఓ జంటకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది. అయితే ఈ అంశంపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నమోదు అయ్యింది. అయితే వాస్తవానికి ఈ వీడియో ఫేక్ అని.. ఎవరో ఉద్దేశపూర్వకంగా కావాలనే దాన్ని ఎడిట్ చేశారని ఆ దంపతులు అంటున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఒక యువతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ యువతి గతంలో కూడా ఇదే పిజ్జాషాపులో పనిచేసేది. అయితే ఆ యువతి ఆ పిజ్జాషాపు యజమానిపై ప్రతికారం తీర్చకునేందుకే ఇలాంటి పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే మీడియాకు అందినటువంటి సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం.. జలంధర్‌కు చెందిన ఓ దంపుతులు పిజ్జా షాప్‌ను ప్రారంభించారు. అయితే ఇటీవలే ఈ దంపతులకు చెందిన ప్రైవేటు వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఈ జంట పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. అలాగే పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆ దుకాణదారు తమ ప్రైవేటు వీడియోను ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారని చెప్పారు. అలాగే తమను 20 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని.. పేర్కొన్నారు. ఒకవేళ ఈ డబ్బులు ఇవ్వలేకపోతే.. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇంకా వైరల్ చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ మధ్యనే దుండగులు ఆ దంపతులకు చెందిన నాలుగు వీడియోలను వైరల్ చేశారని.. అయితే అందులో ఒకటి అభ్యంతరకరంగా ఉందని పోలీసులు చెప్పారు.
అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఒక యువతితో పాటుగా.. ఒక అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఈ కేసుపై పోలీసు అధికారి అయిన నిర్మల్ సింగ్ స్పందించారు. ఇందులో నిందితురాలిగా తనీషా అనే యువతి గుర్తించామని.. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే ఆమె గతంలో.. ఒక పిజ్జా దుకాణంలో పనిచేసేదని పేర్కొన్నారు. కానీ ఆమె పనితీరు అనేది నచ్చకపోవడంతో.. ఆ షాపు యజమాని ఆమెను పనిలో నుంచి తొలగించినట్లు తెలిపారు. దీంతో ఆ యాజమానిపై కోపం పెంచుకున్న తనీషా ప్రతికారం తీర్చుకోవాలనుకుందని చెప్పారు. ఇందుకోసం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నకిలీ ఐడీని క్రియేట్ చేసిందని.. అలాగే ఆ దుకాణ యజమాని దంపతులకు చెందినటువంటి ఒక ప్రైవేటు వీడియోను కూడా వైరల్ చేసినట్లు ఆ పోలీసు అధికారి చెప్పారు. అలాగే ఆమె 20 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిందని చెప్పారు. అయితే ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




