AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salary Negotiation: జీతం పెంచమని డైరెక్ట్‌గా అడగలేకపోతున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి

నిజానికి జీతం పెంచమని అడగడం ఒక కళ. దీని కోసం ఉద్యోగులు సరైన టెక్నిక్స్ ను, స్ట్రాటజీలను వాడాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఈ విషయాన్ని డీల్ చేయగలిగితే మీరనుకున్న పని స్మూత్ గా నెరవేరుతుంది. మరి యాజమాన్యాన్ని సమర్థవంతంగా జీతం పెంపు కోసం అడగడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Salary Negotiation:  జీతం పెంచమని డైరెక్ట్‌గా అడగలేకపోతున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి
Salary Negotiation Tips
Bhavani
|

Updated on: Apr 17, 2025 | 8:23 PM

Share

కొందరు ఒకే ఆఫీసులో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తుంటారు. కానీ, జీతం విషయంలో అసంతఈప్తి తోనే ఉంటారు. తమ సార్థ్యాలకు, చేస్తున్న పనికి వచ్చే జీతం చాలడంలేదని వారి దగ్గరా వీరి దగ్గరా చెప్పుకుంటూ తమ సమస్యను యాజమాన్యం దఈష్టికి తీసుకెళ్లడానికి సంకోచిస్తారు. అయితే, పైవారి దగ్గర మీకున్న క్రెడిబిలిటీ దెబ్బతినకుండా అదే సమయంలో మీ సమస్యను వారిముందుంచేలా మిమ్మల్ని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

1. మార్కెట్ జీతాలను పరిశోధించండి

ఆఫీసులో మీ రోల్, అనుభవం వంటి వాటికి బయటి కంపెనీల్లో ఎంత జీతం చెల్లిస్తున్నారో ముందు తెలుసుకోండి. గ్లాస్‌డోర్, పేస్కేల్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించి కూడా మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీ రంగంలో సాధారణంగా చెల్లించే జీతాలను ఆధారంగా చేసుకుని, వాస్తవిక లక్ష్యాన్ని నిర్దేశించండి. ఈ డేటా మీ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది.

2. మీ విలువను హైలైట్ చేయండి

మీ స్కిల్ సెట్ ను సామర్థ్యాలను సంస్థకు అందించిన సహకారాలను స్పష్టంగా వివరించండి. ఉదాహరణకు, మీరు ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఉంటే లేదా ఆదాయాన్ని పెంచినట్లైతే, ఆ వివరాలను ఉదాహరణలతో సబ్ మిట్ చేయండి. ఈ సాక్ష్యాలు మీ జీతం పెంపు డిమాండ్‌కు ఆధారంగా నిలుస్తాయి.

3. చర్చలకు సన్నద్ధం కండి

జీతం చర్చలకు ముందు, స్నేహితుడు లేదా మీరు మెంటార్ గా భావించే వారితో మాక్ చర్చలు ప్రాక్టీస్ చేయండి. యాజమాన్యం నుండి వచ్చే ప్రశ్నలు లేదా కౌంటర్ ఆఫర్‌లకు సమాధానాలను సిద్ధం చేసుకోండి. ఈ సన్నద్ధత మీకు చర్చల సమయంలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

4. సరైన సమయాన్ని ఎంచుకోండి

జీతం పెంపు కోరే సమయం చాలా కీలకం. పనితీరు సమీక్షలు, విజయవంతమైన ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, లేదా కొత్త బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ చర్చలను ప్రారంభించండి. మీ విలువ స్పష్టంగా కనిపించే క్షణాలను ఎంచుకోవడం విజయవంతమైన చర్చలకు సహాయపడుతుంది.

5. జీతం పెంచలేమంటే..

యాజమాన్యం మీ జీతం అంచనాలను అందుకోలేని సందర్భంలో, ప్రత్యామ్నాయ ప్రయోజనాలను చర్చించండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ గంటలు, అదనపు సెలవు రోజులు, శిక్షణా కార్యక్రమాలు, లేదా ఇతర సౌకర్యాలు వంటివి మీ సంతృప్తిని పెంచగలవు. సౌలభ్యం చూపడం ద్వారా సానుకూల సంబంధాన్ని నిర్వహించవచ్చు.

6.  ఆత్మవిశ్వాసం ప్రదర్శించండి

చర్చల సమయంలో పాజిటివ్ గా ఉండటానికే ప్రయత్నించండి. ఉత్సాహంతో, గౌరవంతో మాట్లాడండి. ఎక్కడా కూడా అల్టిమేటమ్‌లను ఇవ్వకండి. మీరు మీ జాబ్ రోల్ పై ఆసక్తి కలిగి ఉన్నారని, అదే సమయంలో మీ విలువను గుర్తించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేయండి. ఈ వైఖరి మీపై యాజమాన్యానికి మంచి ఒపీనియన్ కలిగేలా చేస్తుంది.

జీతం పెంపు కోరడం అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది మీ విలువను గుర్తించడం వంటిది. సరైన సన్నద్ధత, సమయం, వృత్తిపరమైన వైఖరితో, మీరు ఈ చర్చలను విజయవంతంగా నిర్వహించవచ్చు. ఈ చిట్కాలను అనుసరించి, మీ కెరీర్‌లో ఆర్థిక వృత్తిపరమైన వృద్ధిని సాధించండి.