AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Friday 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!

ప్రతి సంవత్సరం క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు. ఇది శిలువపై ఏసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు. ఆయన మనల్ని రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన రోజే ఇది. ఎంతో దుఃఖభరితమైనా.. అదే సమయంలో మనలో మనస్పూర్తిగా కృతజ్ఞత కలిగించే రోజు.

Good Friday 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!
Good Friday 2025
Prashanthi V
|

Updated on: Apr 17, 2025 | 7:37 PM

Share

ప్రాచీన కాలంలో అప్పటి పాలకులు ఏసుప్రభువుని అత్యంత దారుణంగా శిక్షించారు. ముళ్లతో చేసిన కిరీటాన్ని తలపై పెట్టి, శరీరాన్ని కొరడాలతో కొట్టారు. చివరికి ఆయనను శిలువపై వేలాడదీశారు. కానీ ఆయన ఇదంతా భరించటానికి సిద్ధంగా ఉండటమే కాకుండా.. మానవాళి కోసం తనను తానే త్యాగం చేసుకున్నారు. ఈ గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు గుడ్ ఫ్రైడే. ఇది ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 18న క్రైస్తవులు చర్చీల్లో ప్రార్థనలు చేసి ప్రభువు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారు.

2025 గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

మన తప్పులకు బరువు మోసిన ప్రభువుకు మనం ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఆయన చేసిన త్యాగం మనకు మార్గదర్శకంగా నిలవాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఏసుప్రభువు చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ మన మనసుల్లో శాశ్వతంగా నిలిచి ఉండాలి. ఈ పవిత్ర రోజున ఆయన ఆశీస్సులు మీకెప్పుడూ ఉండాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఆయన జీవితం దయ, ప్రేమ, క్షమాపణల చిహ్నం. మనమూ అదే బాటలో నడవాలి. గుడ్ ఫ్రైడే రోజు మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఈరోజు మనకు శాంతి, ఆత్మ నిమ్మదిని కలిగించాలి. ఆ ప్రభువు చూపిన దారిలో మనం నడవాలని ప్రార్థించుదాం. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఈ పవిత్ర గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు ప్రేమ, క్షమా, దయ మీ జీవితాన్ని వెలిగించుగాక. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

శిలువపై చూపిన త్యాగం శాశ్వత ప్రేమకు చిహ్నం. గుడ్ ఫ్రైడే సందర్భంగా శాంతి కలగాలని కోరుకుంటున్నా. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

మనకోసమే తన ప్రాణాన్ని అర్పించిన ఏసుని ఈ రోజు వినమ్రతతో స్మరించుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఈ గుడ్ ఫ్రైడే, మీ జీవితం ప్రేమతో, విశ్వాసంతో నిండిపోవాలని ఆశిస్తున్నా. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఏసుప్రభువు ఆశీస్సులతో మీకు శాంతి, క్షమ, మానవతా విలువలు నిత్యం సహచరమవ్వాలని ప్రార్థిస్తున్నా. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ప్రభువు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రేమను పంచుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ప్రేమకే శిలువగా మారిన ప్రభువుని ప్రార్థించుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

నిస్వార్థతకు ప్రతిరూపంగా నిలిచిన ప్రభువు ప్రేమ మీపై తరలించుగాక. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

శిలువపై చీకటి కనిపించినా.. ఆ చీకటిలోనే ప్రేమ వెలుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఈ పవిత్ర గుడ్ ఫ్రైడే.. మీ హృదయాన్ని శాంతితో నింపాలని ఆశిస్తున్నా. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఈ గుడ్ ఫ్రైడే, మీ ఇంట్లో శాంతి, మీ మనసులో ప్రేమ నింపాలని ప్రార్థిస్తున్నా. మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.