భారత దేశంలోని ప్రముఖ గేమర్లతో ప్రధాని మోదీ చిట్ చాట్ నిర్వహించారు. @ignindia, @mashable.india భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గేమర్లు అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, నమన్ మాథుర్‌తో పాటు అన్షు బిష్త్ లు పాల్గొన్నారు. వీరితో కలిసి ప్రధాని మోదీ గేమ్ ఆడారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో మోదీ సరికొత్త శకానికి నాంది పలికారు. యవతను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. గేమింగ్ పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలోని ప్రముఖ గేమర్‌లతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాల ఆధారంగా గేమింగ్ లను రూపొందించాలని ఉదాహరణకు పంచతంత్ర కథలను కీలకంగా చేసుకుని వీటిని రూపొందిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు. ఇలాంటి వాటిపై భారతీయులకు అమిత విశ్వాసంతో పాటు చలాకీ తనం కూడా బోధపడుతుందని వివరించారు. ఇలా చేయడం వల్ల ఆడే వారి సంఖ్య పెరిగి అందులో మహిళలను భాగస్వామ్యం చేయడంతో వారికి ఉపాధితో పాటు కెరియర్ ను అభివృద్ది చేసేందుకు దోహదపడుతుందని చెప్పారు.
భారతదేశంలో గేమర్స్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా చర్చ జరిగింది. గేమింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ప్రముఖ గేమర్లు తెలిపారు. దీని వెనుక ఎంత యానిమేషన్ వర్క్ ఉంటుందో దాని గురించి మోదీకి వివరించారు. అయితే ఈ పరిశ్రమ గురించి బయట చాల మందిలో అనేక అపార్థాలు ఉన్నాయని వాటిపై మీ సమాధానం ఏంటని గేమర్లను అడిగారు మోదీ. నైపుణ్యం ఆధారిత గేమ్‌లను ఎంచుకోవడంపై కూడా స్పందించారు. అయితే మోదీ ప్రశ్నకు బదులుగా అటగాళ్ల మధ్య రెండు రకాలా తేడాలుంటాయని చెప్పారు. ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసం ఆడే వారు అనేక టెన్షన్లకు, ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అలాగే వ్యసనంగా మార్చుకోకుండా కేవలం సరదాగు ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తవని చెప్పారు గేమర్లు. ఈ సమావేశంలో, పీఎం మోదీ వీఆర్, పీసీ, కన్సోల్, మొబైల్ గేమింగ్ వంటి వివిధ రకాల ఆటలను ఆడినట్లు తెలిస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎలాంటి నియమాలను రూపొందించిందో మోదీ తెలిపారు. ఇంతేకాకుండా ఇ-స్పోర్ట్స్‌ను పర్యవేక్షించడంలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు ఎలాంటి బాధ్యతలు అప్పగించిందో కూడా ఈ చిట్ చాట్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..