PM Modi: ‘మోదీజీ దీపావళికి మా ఊరు రావాలి’.. తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌ పొందిన గ్రామ ప్రజలతో ప్రధాని మాటమంతీ..

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనతను సాధించింది. భారతదేశంలోనే తొలిగ్రామంగా పేరు గాంచిన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలైన గియుకు మొబైల్ కనెక్టివిటీని అందించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి ప్రాంతంలోని గియు గ్రామం ఈరోజు మొదటిసారిగా మొబైల్ నెట్‌వర్క్‌ను పొందింది.

PM Modi: ‘మోదీజీ దీపావళికి మా ఊరు రావాలి’.. తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌ పొందిన గ్రామ ప్రజలతో ప్రధాని మాటమంతీ..
Pm Modi
Follow us

|

Updated on: Apr 18, 2024 | 10:04 PM

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనతను సాధించింది. భారతదేశంలోనే తొలిగ్రామంగా పేరు గాంచిన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలైన గియుకు మొబైల్ కనెక్టివిటీని అందించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి ప్రాంతంలోని గియు గ్రామం ఈరోజు మొదటిసారిగా మొబైల్ నెట్‌వర్క్‌ను పొందింది. టెలికాం కనెక్టివిటీ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన నేపథ్యంలో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్థానికులతో ఫోన్‌లో ఆప్యాయంగా మాట్లాడారు. గియులో మొబైల్ సేవల ప్రారంభం పట్ల స్థానికులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనికేషన్, సమాచారం చేరవేసేందుకు కొత్త శకం మొదలైందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మొబైల్ నెట్‌వర్క్‌ను పొందిన తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి ప్రాంతంలోని గియు గ్రామస్థులతో పీఎం నరేంద్ర మోడీ మాట్లాడిన వీడియోను వార్తా సంస్థ ANI పంచుకుంది. ఈ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ముందు గ్రామస్తులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రధాని మోదీ అడగడం వినవచ్చు. ప్రతిస్పందనగా, స్థానికులు తమ ఫోన్‌లలో మొబైల్ నెట్‌వర్క్‌ను స్వీకరించడానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడం చాలా కష్టంగా ఉండేదని ఒక వ్యక్తి ప్రధాని మోదీకి చెప్పారు. ఈ సందర్భంగా గియు నివాసితులను ప్రధాని మోదీ అభినందించగా.. గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు గ్రామస్తులు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే దీపావళికి తమ ఊరికి రావాలంటూ గ్రామస్తులు ప్రధాని మోదీని ఆహ్వానించగా.. తప్పకుండా వస్తానంటూ పేర్కొన్నారు.

వీడియో చూడండి:

కౌరిక్‌, గియు గ్రామాలు హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌, స్పితి జిల్లాలో ఉన్నాయి. ఈ గ్రామాలు సముద్ర మట్టానికి సుమారు 14,931 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికం ట్విట్టర్‌ వేదికగా బుధవారం ప్రకటించింది. దేశంలోని మొదటి గ్రామానికి టెలికం సేవలు అందాయని.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టవర్‌కు సంబంధించిన ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఈ ప్రాంతం స్పితి అనే నది లోయ పరివాహక ప్రాంతంలో ఉంది. కౌరిక్‌ టిబెట్‌ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది. గియా గ్రామం స్పితి వ్యాలీలోని టాబో అనే గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles