Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రపంచంలో మూడో ఆర్ధిక శక్తిగా భారత్ అవతరిస్తుంది..

ITPO Complex Launch: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రికార్డు స్థాయిలో మూడోసారి కూడా మన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజాభిమానం తిరస్కరించిన ముఖాలు మాత్రం అలాగే ఉంటాయన్నారు.

PM Modi: దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రపంచంలో మూడో ఆర్ధిక శక్తిగా భారత్ అవతరిస్తుంది..
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2023 | 8:43 PM

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఏర్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రగతి మైదాన్‌లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు.  ఈ ఉదయం ITPO ప్రాంగణంలో హవన్ మరియు పూజలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం కేంద్రం నిర్మాణంలో నిమగ్నమైన కూలీలను ఆయన కలుసుకుని సన్మానించారు. ఈ మండపాన్ని చూసి ప్రతి భారతీయుడు  సంతోషంగా, గర్వపడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. కన్వెన్షన్ సెంటర్ భారతదేశ సంభావ్యతకు, నూతన శక్తికి పిలుపు.. భారత మండపం భారతదేశం గొప్పతనం, సంకల్పం దర్శనం అని అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రికార్డు స్థాయిలో మూడోసారి కూడా మన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజాభిమానం తిరస్కరించిన ముఖాలు మాత్రం అలాగే ఉంటాయన్నారు. ప్రతిపక్షాలపై దాడి చేస్తూ, నెగెటివ్ ఆలోచనాపరులు దాని నిర్మాణాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారని.. కానీ అవేవీ ఫలించలేదని అన్నారు. వారు కోర్టుల చుట్టూ కూడా తిరిగారు.. కానీ భారతదేశ ప్రజలు దానిని పూర్తి చేశారు. విధి నిర్వహణలో కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రికార్డు స్థాయిలో మూడోసారి కూడా మన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజాభిమానం తిరస్కరించిన ముఖాలు మాత్రం అలాగే ఉంటాయన్నారు. ఈ ఉదయం ఆయన క్యాంపస్‌లో వేద మంత్రోచ్ఛారణలతో ప్రార్థనలు చేశారు. దీని తయారీకి దాదాపు రూ. 2700 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ-20 సమావేశాలపై స్మారక నాణెం, తపాలా స్టాంపును ఆయన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ప్రధాని కూడా ప్రసంగిస్తారు. ఈ సమావేశ కేంద్రానికి ‘భారత మండపం’ అని పేరు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం