Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Missing: దేశంలో మహిళల మిస్సింగ్ కేసులు.. ఆ రాష్ట్రమే టాప్

దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలకు మిస్సవుతున్న ఘటనలు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. అందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తే చాలావరకు కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఈ మిస్సింగ్ కేసు ఘటనలు చాలావరకు ఓ మిస్టరీగానే ఉండిపోతున్నాయి.

Women Missing: దేశంలో మహిళల మిస్సింగ్ కేసులు.. ఆ రాష్ట్రమే టాప్
Woman
Follow us
Aravind B

|

Updated on: Jul 26, 2023 | 8:50 PM

దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలకు మిస్సవుతున్న ఘటనలు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. అందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తే చాలావరకు కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఈ మిస్సింగ్ కేసు ఘటనలు చాలావరకు ఓ మిస్టరీగానే ఉండిపోతున్నాయి. ఎవరూ, ఎక్కడ, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. అయితే దేశంలో మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలోని మహిళల మిస్సింగ్ కేసులో మహారాష్ట్ర టాప్‌లో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

2021లో మహారాష్ట్రంలో 56,498 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పారు. ఈ మిస్సింగ్ కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాలు నిలిచాయి. అలాగే 2021లో తెలంగాణలో 12834 మంది మహిళలు మిస్ అవ్వగా.. ఆంధ్రప్రదేశ్‌లో 8969 మహిళలు అదృశ్యం అయినట్లు తెలిపింది.