PM Modi: ఇండియా-ఆసియా సహకారాన్ని విస్తరిద్దాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

భారత్, ఆసియన్ కూటమిల మధ్య సహకార విస్తృతికి ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే దీనిపై ఆయన 12 అంశాల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అనుసంధానత, వాణిజ్యం అలాగే డిజిటలైజేషన్.. కోవిడ్ తర్వాత నియమా ఆధారిత ప్రపంచ క్రమం నిర్మాణం వంటి విషయాల పట్లు ఉమ్మడిగా ప్రయత్నాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఇండోనేసియా రాజధాని అయిన జకార్తాలో గురువారం జరగినటువంటి ఆసియాన్-భారత్ 20 వ సదస్సు.. తూర్పు ఆసియా 18వ సదస్సులో ప్రధాని తన ప్రసంగం చేశారు.

PM Modi: ఇండియా-ఆసియా సహకారాన్ని విస్తరిద్దాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi

Updated on: Sep 08, 2023 | 10:48 AM

భారత్, ఆసియన్ కూటమిల మధ్య సహకార విస్తృతికి ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే దీనిపై ఆయన 12 అంశాల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అనుసంధానత, వాణిజ్యం అలాగే డిజిటలైజేషన్.. కోవిడ్ తర్వాత నియమా ఆధారిత ప్రపంచ క్రమం నిర్మాణం వంటి విషయాల పట్లు ఉమ్మడిగా ప్రయత్నాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఇండోనేసియా రాజధాని అయిన జకార్తాలో గురువారం జరగినటువంటి ఆసియాన్-భారత్ 20 వ సదస్సు.. తూర్పు ఆసియా 18వ సదస్సులో ప్రధాని తన ప్రసంగం చేశారు. ఆగ్నేయాసియా, ఇండియా, పశ్చిమాసియా అలాగే ఐరాపా దేశాలను అనుసంధానం చేసేటటువంటి ఆర్థిక నడవాను బహుళ రవాణ సిస్టమ్‌లతో ఏర్పాటు చేసేలా కృషి చేయడం అవసరమని అన్నారు. అలాగే ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను సమకూర్చడం, అలాగే సైబర్ రంగంలో ఉన్నటువంటి తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడం లాంటి విషయాలు ఆయన ప్రతిపాదించిన అంశాల్లో ఉన్నాయి.

మరోవైపు ఆసియన్ కూటమి అంటేనే ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఆసియా శకమని.. ఇండో-పసిఫిక్ వాణిజ్యమనేది మనందరి ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనికోసం భుజం.. భుజం కలిపి పనిచేయాలని ప్రధాని అన్నారు. తూర్పు దశాలకు ప్రాధాన్యం అనేది మా విధానంలో ఆసియన్ మూలస్తంభమని తెలిపారు. అయితే చారిత్రకంగా, భౌగోలికంగా భారత్, ఆసియన్‌ల మధ్య పరస్పర సహకారంతో నిలకడగా ఉన్న పురోగతి కనిపిస్తోందని చెప్పారు. మనకున్న బలానికి ఇది నిదర్శమని.. అలాగే జన్ ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నటువంటి నాణ్యమైన ఔషధాలను ప్రజలకు అందించడంలో తమ అనుభవాన్ని ఆసియన్ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే విపత్తుల నుంచి కోలుకునేలా ఉండటానికి మౌలిక సదుపాయాలను కల్పించడం.. అలాగే ఆసియన్ దేశాల భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పారు.

ఇదిలా ఉండగా తూర్పు ఆసియా ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తూర్పు ఆసిన దేశాధినేతలను తెలిపారు. వ్యూహత్మకంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం సమ్మిళితంగా.. పోటీతత్వంతో ముందుకు వెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను బాధ్యతాయుతంగా ఎదుర్కోవంలో కూడా కలిసి కృషి చేస్తామని చెప్పారు. అలాగే స్నేహపూరితంగా ఉన్న బంధాలను బలోపేతం చేస్తామన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏడు పేజీల ప్రకటన విడుదలైంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం.. అలాగే సాంకేతికతను నాలుగోతరం పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించే విషయంలో పురోగతి సాధిస్తామని చెప్పారు. అలాగే సమానత్వం, భాగస్వామ్యం, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలను ప్రోత్సహించేందుకు తమ కట్టుబాట్లను వివరించారు. అలాగే దేశాల సార్వభౌమత్సాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేయాలని మోదీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..