Rahul Gandhi : ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల విసుర్లు.. కరోనా మందులతోపాటు మోదీ కూడా కనిపించడంలేదన్న రాహుల్

|

May 13, 2021 | 4:19 PM

Rahul Gandhi : దేశంలో కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో టీకాలు, ఆక్సిజన్, మందులతో పాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు...

Rahul Gandhi : ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల విసుర్లు..  కరోనా మందులతోపాటు మోదీ కూడా కనిపించడంలేదన్న రాహుల్
Follow us on

Rahul Gandhi : దేశంలో కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో టీకాలు, ఆక్సిజన్, మందులతో పాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై హిందీలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర విస్టా ప్రాజెక్టు, ఔషధాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ప్రధాని ఫోటోలు మాత్రమే అక్కడక్కడా కనిపిస్తున్నాయని రాహుల్ విమర్శించారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ – 19 సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో ఆక్సిజన్, మందులు.. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంపై కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లోని ఇతర సీనియర్ నేతలూ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు కురిపించారు. మహమ్మారి నియంత్రణలో వారి నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని కాంగ్రెస్ ఎంపీ మనీత్ తివారీ ట్వీట్ చేశారు. మార్పు కోసం ఏదైనా చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు. మరోవైపు, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పై కాంగ్రెస్ అనుమానాలు, ఆరోపణల వల్లే ఆ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందంటూ కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి చేసిన విమర్శలకూ కాంగ్రెస్ సీనియర్ నేతలు కౌంటరిచ్చారు.

కాంగ్రెస్ ట్వీట్ల వల్లే వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందా? అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. తన ట్వీట్ల వల్లే కేంద్ర ప్రభుత్వం సరిపడా వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టలేదా? అని ఆయన మరో ప్రశ్న సంధించారు. పవిత్ర గంగా నదిలో తేలియాడుతున్న కరోనా మృతదేహాలపై కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. “ఈ కొత్త భారతదేశంలో నదులలో తేలియాడే మృతదేహాలు కూడా ప్రభుత్వానికి కనిపించవు. సిగ్గు …” అని హిందీలో ట్వీట్ చేస్తూ, మృతదేహాలను ఇసుకలో పాతిపెట్టినట్లు వచ్చిన వార్తాకథనాన్ని ఉటంకిస్తూ సుర్జేవాలా మండిపడ్డారు.

 

Read also : Free Covid treatment : షాపూర్ నగర్ మల్లారెడ్డి కొవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉచిత వైద్య, ఆహార, మందుల సేవలు