PM Narendra Modi: ‘అటల్’ బ్రిడ్జిన్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ..

|

Aug 27, 2022 | 8:14 PM

PM Narendra Modi: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై నిర్మించిన ఫూట్ ఓవర్ బ్రిడ్జి‌ను ఆకస్మికంగా సందర్శించారు..

PM Narendra Modi: ‘అటల్’ బ్రిడ్జిన్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ..
Pm Modi
Follow us on

PM Narendra Modi: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై నిర్మించిన ఫూట్ ఓవర్ బ్రిడ్జి‌ను ఆకస్మికంగా సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అహ్మదాబాద్ ‘అటల్ బ్రిడ్జ్’ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ ఫ్రంట్‌కు తూర్పు, పడమర వైపులను కలుపుతూ అటల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మాజీ ప్రధానిఅటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ కేవలం పాదాచారుల కోసమే కావడం విశేషం. దాదాపుగా 300 మీటర్ల ఫుల్ ఓవర్ బ్రిడ్జ్‌ను ప్రత్యేక డిజైన్ తో నిర్మించారు. అయితే, అటల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నుంచే రిమోట్ కంట్రోల్ సాయంతో ప్రారంభించారు. తాజాగా ఆయన మనసు మార్చుకున్నారో ఏమో గానీ, అటల్ బ్రిడ్జిన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వంతెనపై కలియతిరిగారు. కాసేపు వంతెన అంతా చుట్టేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..