ప్రకృతి వైపరీత్యాల ముప్పు వీలైనంతవరకు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్ వేదకిగా ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు జాతీయ వేదిక (NPDRR) మూడో సదస్సు ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లాంచనంగా ఈ సదస్సును ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈసారి ‘మారుతున్న వాతావరణానికి తగ్గట్టు స్థానిక సంసిద్ధత’ అనే థీమ్‌తో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీతలను ప్రధాన మంత్రి ఘనంగా సత్కరించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు కార్యక్రమాలు, సాధనాలు, సాంకేతికతలను ప్రదర్శించే ఎగ్జిబిషన్‌ను కూడా మోడీ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధానమంత్రితో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విద్యావేత్తలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ముప్పు తగ్గించేలా పలు అంశాలపై చర్చ నిర్వహించనున్నారు. వివిధ స్థాయిల్లో విపత్తుల ప్రమాదాన్ని తగ్గించే వ్యవస్థలను మరింత బలోపేతం చేసే అంశంపై కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు చర్చిస్తారు. నిపుణులు, ప్రాక్టీషనర్లు, విద్యావేత్తలు, ప్రతినిధులు సెండాయ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా విపత్తు ప్రమాద తీవ్రత తగ్గించడానికి సహకరించే వివిధ అంశాలు, విపత్తు తీవ్రత తగ్గించడానికి ప్రధాన మంత్రి మోడీ ప్రతిపాదించిన 10 అంశాల ఎజెండాపై చర్చలు జరగనున్నాయి.
ఎన్పీడీఆర్ఆర్ సదస్సుకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల విపత్తు నిర్వహణ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిధులు, మీడియా, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు సహా 1000 మందికి పైగా విశిష్ట అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠ్‌తో పాటు హిమాలయాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. ఇళ్లన్నీ పగుళ్లు..గోడలన్నీ నెర్రెలిచ్చుకుపోయాయి..రోడ్ల మీద ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపించాయి. వాతావరణంలోని అనూహ్య మార్పుల వల్లే ఇలా జరిగిందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో జోషిమఠ్ ప్రస్తావన కూడా ఎన్పీడీఆర్‌ఆర్ సదస్సులో ప్రస్తావనకు రానుంది.
The system related to disaster management in India has always been local, the solutions have been local & strategy has been local too: PM Narendra Modi at the 3rd Session of the National Platform for Disaster Risk Reduction in Delhi pic.twitter.com/3077W0jlBA
— ANI (@ANI) March 10, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..