PM Modi: దౌత్యం – చర్చలే మార్గం.. వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఇంటర్వ్యూలో ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సలహా..

|

Jun 20, 2023 | 11:45 AM

PM Modi interview to Wall Street Journal: అంతర్జాతీయ స్థాయి వివాదాల పరిష్కారం కోసం అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు.

PM Modi: దౌత్యం - చర్చలే మార్గం.. వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఇంటర్వ్యూలో ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సలహా..
Pm Modi
Follow us on

PM Modi interview to Wall Street Journal: అంతర్జాతీయ స్థాయి వివాదాల పరిష్కారం కోసం అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు. ఎలాంటి వివాదమైనా యుద్ధం ద్వారా గెలిచే బదులు “దౌత్యం – సంభాషణ” ద్వారా పరిష్కరించుకోవాలంటూ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అమెరికా వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి ప్రధాని మోడీ సుధీర్ఘంగా మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే.. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు.. పలు సూచనలు చేశారు.

ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అమెరికాతో సంబంధాలు ఇప్పుడు మరింత బలపడ్డాయని అన్నారు. చైనా ఘర్షణ, ఆ దేశంతో సంబంధాల గురించి కూడా మోడీ మాట్లాడారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దులో శాంతి, ప్రశాంతత అవసరమని ప్రధాని అన్నారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తాము ఎల్లప్పుడూ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాము, చట్ట నియమాలకు కట్టుబడి ఉంటాము. శాంతియుత మార్గాల ద్వారా వివాదాలు, విభేదాలను పరిష్కరించుకుంటామన్నారు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని పరిరక్షించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.. ఈ విషయాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి: ప్రధాని మోదీ..

అంతర్జాతీయ వివాదాలు.. యుద్ధం, ఘర్షణల గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఏ రకమైన వివాదమైనా యుద్ధం ద్వారా గెలిచే బదులు “దౌత్యం – సంభాషణ” ద్వారా పరిష్కరించేలా ఉండాలి.’’ అంటూ సూచించారు.

ఇవి కూడా చదవండి

న్యూఢిల్లీ – వాషింగ్టన్ మధ్య నెలకొన్న సంబంధాల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ తిరుగుబాట్ల మధ్య భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తన సముచిత స్థానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నందున ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే బలంగా, లోతుగా ఉన్నాయని తెలిపారు. భారత్, అమెరికా నేతల మధ్య ‘అద్భుతమైన విశ్వాసం’ నెలకొందని ఆయన అన్నారు.

రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం మన భాగస్వామ్యానికి ఒక ముఖ్యమైన మూలస్తంభమని ప్రధాని మోదీ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది కేవలం దీనికే పరిమితం కాకుండా వాణిజ్యం, సాంకేతికత, ఇంధన రంగానికి విస్తరించిందని తెలిపారు.

కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వాల్టి నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి న్యూయార్క్‌లో దిగనున్నారు. అమెరికాకు చేరుకునే ముందు అమెరికా వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..