Cyclone Biparjoy: ముంచుకొస్తున్న తుఫాన్ పై ప్రధాని మోదీ సమీక్ష.. స్కూల్ సెలవులు ప్రకటించిన ఆ రాష్ట్రం..

|

Jun 13, 2023 | 5:35 AM

Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బిపర్‌జాయ్‌ తుఫాన్‌పై గుజరాత్‌ ,మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. తుఫాన్‌పై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ బాధితులకు తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సూచించారు. అలల ఉధృతికి ముంబై జుహూ బీచ్‌లో నలుగురు గల్లంతయ్యారు. ..

Cyclone Biparjoy: ముంచుకొస్తున్న తుఫాన్ పై ప్రధాని మోదీ సమీక్ష.. స్కూల్ సెలవులు ప్రకటించిన ఆ రాష్ట్రం..
PM Modi meet on Cyclone Biparjoy
Follow us on

Cyclone Biparjoy: గుజరాత్‌ తీరం వైపు దూసుకొస్తున్న బిపర్‌జాయ్‌ తుఫాన్‌పై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అమిత్‌షాతో పాటు NDRF,IMD అధికారులు హాజరయ్యారు. తుఫాన్‌పై ముందుజాగ్రత్త చర్యలను సూచించారు మోదీ. ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సహాయక చర్యలపై 24 గంటల పాటు ఫోకస్‌ పెట్టాలని సూచించారు. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో పశ్చిమ తీరం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్ర లోని రత్నగిరి దగ్గర బీచ్‌లో రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. అలల ఉధృతి చూసి అక్కడ ఉన్న టూరిస్టులు భయంతో పరుగులు పెట్టారు. మరోవైపు ముంబై జుహూ బీచ్‌లో కూడా రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. అలల ఉధృతికి ఆరుగురు సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు రక్షించగా మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ బిపర్‌జాయ్ తుఫాను.. అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది మరింత బలపడుతోంది..దీని కారణంగా ప్రస్తుతం గుజరాత్‌లో వర్షాలు పడుతున్నాయి.. అరేబియా సముద్రంలో బిపర్‌జాయ్ తుఫాను.. అంతకంతకూ బలపడుతోంది. ప్రస్తుతం తీవ్ర తుఫానుగా ఉన్న బిపర్‌జాయ్..వచ్చే 8 గంటల్లో మరింత బలపడి.. అత్యంత తీవ్ర తుఫానుగా మారుతుందని IMD తెలిపింది. ఇది జూన్ 15 నాటికి పాకిస్థాన్, ఉత్తర గుజరాత్‌పై అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. తుఫాన్‌ కారణంగా గుజరాత్‌ ప్రభుత్వం ఈనెల 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

అలాగే గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌ తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది గుజరాత్‌ ప్రభుత్వం. గుజరాత్‌లో సహాయక చర్యల కోసం 10 NDRF బృందాలు సిద్దంగా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా నాలుగు బృందాలను రెడీ చేశారు. కాగా, ఈ తుఫాను వల్ల ఇప్పటికే గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..ప్రస్తుతం ఈ తుఫాను… అరేబియా సముద్రం మధ్యలో ఉంది. ఇది ఉత్తరంవైపుగా కదులుతోంది.ఇది పాకిస్థాన్‌లో తీరం దాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌తోపాటూ.. తీర ప్రాంత రాష్ట్రాల్లో గాలుల వేగం గంటకు 135 కిలోమీటర్లు ఉంది. ఇది మరింత పెరిగి గంటకు 160 కిలోమీటర్లకు చేరుతుందనే అంచనా ఉంది. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు కోరారు. తుఫాన్‌ ప్రభావంతో కేరళలో భరీ వర్షాలు కురుస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..