మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుంది. అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేయడంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ కర్ణాటకలో రెండు రోజులు పర్యటించేందుకు శనివారం అక్కడికి చేరుకున్నారు. ఈ రెండు రోజుల్లో ఆయన ఆరు పబ్లిక్ మీటింగ్స్, రెండు రోడ్ షోలు నిర్వహించనున్నారు. అయితే తాజాగా అక్కడ హుమ్నాబాద్ లోని ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే బీజేపీ ప్రభుత్వ పాలనలో విదేశీ పెట్టుబడులు మూడింతలు పెరిగాయని అన్నారు. కర్నాటక ప్రజలకు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసిందని.. ఆ పార్టీ పాలనలో రైతులు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోయారని విమర్శించారు.
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుజు మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోదీని విషపు పాము అంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ప్రధాని స్పందించారు. కాంగ్రెస్ దుర్వినియోగ రాజకీయాలకు పాల్పడున్న ప్రతిసారి ప్రజలు తమ ఓట్లతోనే సమాధానం చెప్పారని ఉద్ఘాటించారు. కర్ణాటకలో రెండింతల వేగంతో రెండు రేట్ల అభివృద్ధి జరిగిందని తెలిపారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కర్ణాటక ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..