PM Modi: ప్రధాని నివాసంలో అత్యవసర సమావేశం.. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై చర్చ.. చార్టర్ విమానాలను అద్దెకు తీసుకునే ప్లాన్..

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై చర్చించడానికి న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇది భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం (CCS) ప్రధాన మంత్రితో...

PM Modi: ప్రధాని నివాసంలో అత్యవసర సమావేశం.. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై చర్చ.. చార్టర్ విమానాలను అద్దెకు తీసుకునే ప్లాన్..
Pm Modi Chairs Meet On Situ
Follow us

|

Updated on: Aug 17, 2021 | 7:27 PM

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై చర్చించడానికి న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇది భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం (CCS) ప్రధాన మంత్రితో రక్షణ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక మంత్రితోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి సమావేశం అయ్యారు. అప్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చార్టర్ విమానాలను అద్దెకు తీసుకుని భారతీయులను తరలించే యోచనలో భారత ప్రభుత్వం ఉంది. తజికిస్తాన్ ఐని ఎయిర్ బేస్ వద్ద భారత వాయుసేన సీ-17 విమానం ఇప్పటికే అక్కడికి చేరుకుంది.  కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ల్యాండింగ్ కుదరడం లేదు. పరిస్థితి అనుకూలించిన తర్వాత వాయుసేన విమానం కాబూల్ వెళ్లనుంది. ఏంబసీ సిబ్బంది భారత్ తిరిగొచ్చినప్పటికీ సేవలు కొనసాగింపు జరుగుతోంది. స్థానిక సిబ్బందితో సేవలను వారు నిర్వహింస్తున్నారు. ఇప్పటికే భారత్ తిరిగొచ్చేందుకు 1,650 మంది అక్కడి భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు.

భారత్ చేరుకున్న..

కల్లోలిత అఫ్గానిస్థాన్‌ నుంచి భారత అధికారులు స్వదేశానికి చేరుకున్నారు. రాయబార కార్యాలయ అధికారులు, సిబ్బందితో కాబుల్‌ నుంచి బయల్దేరిన వాయుసేన ప్రత్యేక విమానం మంగళవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని జాంనగర్‌ ఎయిర్‌బేస్‌ వద్ద ల్యాండ్‌ అయ్యింది.

ఈ సి-17 విమానంలో 120 మందికి పైగా రాయబార కార్యాలయం, భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు. కొందరు భారత పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై అడుగుపెట్టగానే వారంతా భావోద్వేగం చెందారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

సోమవారం కూడా కాబుల్‌ నుంచి కొంతమంది ఎంబసీ సిబ్బందిని భారత్‌ స్వదేశానికి తరలించింది. ఆ తర్వాత అఫ్గాన్‌ గగనతలం మూసివేయడంతో అక్కడికి విమానాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అమెరికాతో చర్చించి ఎంబసీ అధికారులను రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ మరో విమానం కాబుల్‌ నుంచి భారత్‌కు చేరుకుంది.

ప్రమాదకర ఘంటికలు..

ఆఫ్గనిస్తాన్‌లో ఊహించిదంతా జరిగింది. నాటో దళాలు వైదొలిగితే తలెత్తే పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమైన భయాందోళనలే నిజమయ్యాయి. ఉగ్రమూలాలున్న తాలిబన్ల వశమైంది ఆ దేశం. కొత్త పాలన ఆదేశానికి పరిమితం అయితే నష్టం లేదు. కానీ ప్రపంచానికే ముప్పుగా మారుతుందనే భయాందోళనలున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశానికి అత్యంత ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్నాయి. సద్దుమణుగుతున్న సరిహద్దుల్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరే ప్రమాదం ఉందంటున్నారు విదేశాంగ నిపుణులు. వాస్తవానికి మనం ఆఫ్గన్‌ పునఃనిర్మాణానికి సాయం అందించాం. వేల కోట్లు వెచ్చించి మరీ ప్రాజెక్టులు, ఆసుపత్రులు కట్టించి ఇచ్చాం. కానీ మనసే లేని తాలిబన్లకు ఇవేమీ కనిపించే ఛాన్స్‌ లేదు. పాకిస్తాన్‌కు అండగా ఉంటే మన పరిస్థితి ఏంటి…

తమ ఆధీనంలోకి దేశం..

దేశాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆటవిక పాలనకు కేరాఫ్‌ అయిన తాలిబన్ల చేతిలోకి ఆప్ఘాన్ దేశం వెళ్లడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆ దేశ పౌరులే కాదు.. ప్రపంచమంతా కూడా గజాగజా వణికిపోతోంది. అక్కడి పరిణామాలు భారత్‌కే అత్యంత ప్రమాదమన్న అభిప్రాయం బలపడుతోంది. తాలిబన్లతో అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలకు తీవ్రవాద ముప్పు తప్పదు. అదే సమయంలో మన దేశ సరిహద్దుల్లో కూడా ఇంకా అత్యంత క్లిష్ట పరిస్థితులు వస్తాయమని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తామని అందరికంటే ముందే ప్రకటించడం ద్వారా పాకిస్తాన్‌ తన కుట్రలకు మార్గం సుగమం చేసుకుంటోంది. బలూచిస్తాన్‌లో తాలిబన్ల సాయంతో అక్కడ ఉద్యమాన్ని అణిచివేసి తన బలగాలను కశ్మీర్‌ సరిహద్దుల్లో మోహరించి అస్థిర పరిచే కుట్రలకు పాల్పడవచ్చని అంటున్నారు. అంతేకాదు. ఒకప్పుడు అల్‌ ఖైదా, లష్కర్‌ ఏ తోయిబా వంటి తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చిందే తాలిబన్లు. ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు ఆఫ్గన్‌లో తమ రిక్రూట్‌మెంట్లు యధేచ్చగా సాగిస్తున్నాయని… భారత్‌పై ఎగదోసే ప్రమాదం ఉందని అంటున్నారు అసదుద్దీన్‌. గతంలో పట్టుబడిన తీవ్రవాదుల్లో తాలిబన్లు ఉన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

MP సుబ్రహ్మణ్యస్వామి మాటల్లో..

తాలిబన్‌ వ్యతిరేక శక్తులకు అండగా ఉన్న భారత్‌ వారి లక్ష్యం మనమే అవుతామని.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని MP సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయం. 20 ఏళ్లుగా అమెరికా సహా పలు దేశాలకు చెందిన సైనికులు అక్కడి ఆర్మీకి శిక్షణ ఇచ్చినా కూడా తాలిబన్లను నియంత్రించలేకపోయారు. చివరకు దేశాన్ని ఉగ్రవాదుల చేతుల్లో పెట్టారు. ఫలితంగా ప్రపంచ దేశాలు ముప్పు ముంగిట నిలబడ్డాయి. ఈ పరిస్థితిలో భారత్‌ తీసుకునే విధానం ఎలా ఉంటుందన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి: Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..

తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.

సూపర్ మార్కెట్లో ఒక్కమగాడిలా మార్టీ..! 50 మంది చేసే పని ఒక్కరే చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది..:Marty Robot Video